NewsOrbit
జాతీయం న్యూస్

Mamata Banerjee: మమతా బెనర్జీకి మండింది అక్కడే!నరేంద్ర మోడీని నానా మాటలు అనేసింది గా!!

Mamata Banerjee: ఎన్నికలు ముగిశాక కూడా పశ్చిమబెంగాల్ రాజకీయాల చిటపటలు ఇంకా ఆరలేదు.బిజెపి టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ మూడోసారి కూడా ముఖ్యమంత్రి కాగలగినప్పటికీ మమతా బెనర్జీ ఇంకా కాషాయదళంపై కన్నెర్ర చేస్తూనే ఉన్నారు.ఒంటి చేత్తో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ని గెలిపించిన దీదీ నందిగ్రామ్ లో మాజీ టీఎంసీ సహచరుడు బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి చేతిలో తాను ఓడిపోవడాన్ని ఇంకా జీర్ణించుకోలేకున్నారు.పైగా నారదా కుంభకోణం లో ఇద్దరు టీఎంసీ మంత్రులను అరెస్టు చేసేంత వరకు సీబిఐ వెళ్లడాన్ని కేంద్రం కక్ష సాధింపు చర్యగా భావిస్తున్న మమతా బెనర్జీ సందర్భం వచ్చిన ప్రతిసారి నేరుగా ప్రధాని మోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.తాజాగా కూడా మమతా బెనర్జీ అదే పంధాను అవలంబించడమే కాకుండా ఇతర ముఖ్యమంత్రులను కూడా ప్రధాని నరేంద్ర మోడీపై రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

Mamata Banerjee fires on narendra modi
Mamata Banerjee fires on narendra modi

సీఎంలను పీఎం తోలుబొమ్మలను చేశారు!

కరోనా కట్టడి చర్యలపై గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా సీఎంలను తోలుబొమ్మల మాదిరి చూశారని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రధాని వైఖరి నియంత మాదిరి ఉందన్నారు. కొందరు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ సమావేశం లో మాట్లాడే అవకాశాన్ని ప్రధాని ఇవ్వలేదన్నారు.తాను ఈ సమావేశంలో మాట్లాడదలుచుకున్నా ఆ ఛాన్స్ తనకు ప్రధాని ఇవ్వలేదన్నారు.ప్రజలు పట్టం గట్టిన ఒక ముఖ్యమంత్రిని ప్రధాని మాట్లాడనీయకపోవటం సీఎం పదవికి తీవ్ర అవమానమని ఆమె వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రులను మాట్లాడనీయనప్పుడు వారిని ఎందుకు ఈ మీటింగ్ కి పిలిచారని ఆమె నిలదీశారు. ఇది తనకే కాకుండా ముఖ్యమంత్రులందరికీ జరిగిన అవమానం అన్నారు.ప్ర‌ధానితో ఇలాంటి ముఖ్యమైన సమావేశంలో మాట్లాడేందుకు అనుమ‌తించ‌క‌పోవడంపై అన్ని రాష్ట్రాల సీఎంలు నిర‌స‌న తెల‌పాల‌ని దీదీ పిలుపు ఇచ్చారు.

సొంత డబ్బా కొట్టుకున్న ప్రధాని!

కరోనా ఉధృతి తగ్గిందని ప్రధాని సొంత డబ్బా కొట్టుకున్నారని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలేవీ చర్చకు రాలేదని ఆమె చెప్పారు.కరోనా నిరోధక మందులు,టీకాలకొరత, కొత్తగా తలెత్తిన బ్లాక్ ఫంగస్ వ్యాధి బెడద తదితరాల గురించి ప్రధాని ఏమీ మాట్లాడలేదన్నారు.కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రధాని ఈ సమావేశంలో పేర్కొన్నారని, అదే నిజమైతే ప్రజలు ఎందుకు పిట్టల్లా రాలిపోతున్నారని మమతా బెనర్జీ సూటిగా ప్రశ్నించారు.నరేంద్రమోడీది అంతా షోబిజినెస్ అని ఆమె తేల్చేశారు. ఈ విషయాలన్నింటినీ పశ్చిమ బెంగాల్ ప్రజలకు తాను పూసగుచ్చినట్లు వివరిస్తానని ప్రధాని నిజస్వరూపాన్ని వారికి తెలియజేస్తానని మమతా బెనర్జీ చెప్పారు.

 

author avatar
Yandamuri

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju