NewsOrbit
న్యూస్

అదృష్టం ఉంటె రాయి ని పట్టుకున్న రత్నం అవుతుంది అంట..!! ఏంటో తెలుసుకుందామా…!!

 

 

రాయి కూడా రత్నం అవుతుంది అన్నాడు ఒక మహానుభావుడు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రాయి వల్ల మనిషి కోటీశ్వరుడు అయ్యాడు. తన్నితే గారెల బుట్ట లో పడటట్లు అన్నే సామెత గుర్తువస్తుంది ఈ కథ వింటే. అసలు విషయానికి వెళ్తే శ‌వ‌పేటిక‌లు చేసుకొని జీవించే వ్య‌క్తి రాత్రికి రాత్రి కోటీశ్వ‌రుడైపోయాడు. దీనికి కార‌ణం ఒక ఉల్క‌. అంతరిక్ష లో ఉండే ఒక చిన్నపాటి ఉల్క ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. రూ.10 కోట్ల విలువైన ఆ స్పేస్‌ రాక్, దానితో పాటు అదృష్టాన్ని కూడా మోసుకొచ్చినట్లయింది.

 

4.5 billion years old carbonaceous chondrite metereote

అసలు విషయానికి వెళ్తే, ఈ అనంత విశ్వం నుంచి అప్పుడ‌ప్పుడూ భూమిని ప‌ల‌క‌రిస్తుంటాయి కొన్ని గ్ర‌హ శ‌క‌లాలు. అలాంటిదే ఈ చిన్న ఉల్క కూడా. ఇండోనేషియాకు చెందిన జోసువా హుటాగ‌లుంగ్ ఉత్తర సుమత్రాలోని కోలాంగ్‌ అనే ప్రాంతంలో నివసిస్తుంటాడు. శ‌వ‌పేటిక‌లు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే గ‌త ఆగ‌స్ట్ నెల‌లో అనుకోకుండా ఆకాశం నుంచి దూసుకొచ్చిన ఒక ఉల్క అత‌ని ఇంటిపై ప‌డింది. ఆ ఉల్క దెబ్బ‌కు అత‌ని ఇంటి పైక‌ప్పుకి పెద్ద రంధ్రం కూడా ప‌డింది. ఉల్క ప‌డ‌గానే భారీ శ‌బ్దం వ‌చ్చి, ఇంట్లోని వ‌స్తువుల‌న్నీ చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. సుమారు 2.1 కిలోల బరువున్న స్పేస్ రాక్ పైకప్పు గుండా దూసుకొచ్చి, 15 సెం.మీ లోతు వరకు వెళ్లింది అన్ని ,ఇది అంత తనని ఎంతో భయాందోళనికి గురి చేసింది అన్ని అతను తెలిపాడు. భూమి లోతు లోకి వెళ్లిన ఆ ఉల్కని చేత్తో ప‌ట్టుకున్న‌ప్పుడు చాలా వేడిగా అనిపించింద‌ని జోసువా చెప్పాడు. ఆ ఉల్క‌కు సంబంధించిన ఫొటోల‌ను అత‌డు త‌న ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఈ ఉల్క‌ 450 కోట్ల సంవ‌త్స‌రాల కింద‌టిద‌ని, చాలా అరుదైన‌ద‌ని పరిశోధకులు అంచనా వేశారు. ఇది చాలా అరుదైన కార్బోనేషియస్ కొండ్రైట్ రకానికి చెందినదని వారు తెలిపారు. ఇలాంటి స్పేస్ రాక్ ధర ఒక గ్రాముకు 857 డాలర్లు పలుకుతుందట. ఈ లెక్కన జోసువా 1.85మిలియన్ డాలర్లను సొంతం చేసుకున్నాడు. ఉల్క‌ల‌ను సేక‌రించే అమెరికాకు చెందిన జేరెడ్ కొలిన్స్‌కు జోసువా ఆ రాయిని అమ్మాడు.

ఈ ఉల్క ద్వారా వచ్చిన డబ్బు తన 30 ఏళ్ల జీతానికి స‌మాన‌మ‌ని జోసువా చెప్పాడు. ఇక త‌న వృత్తికి గుడ్‌బై చెప్పేసి, సొంతూళ్లో ఓ కొత్త చ‌ర్చి క‌ట్టాల‌ని అతను భావిస్తున్నాడు. ఇలా ఉంటది అన్నమాట అదృష్టం వరిస్తే. అందుకే అన్నారు పెద్దలు అదృష్టం ఉంటె రాయి కూడా రత్నం గా మారిపోతది అన్ని.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju