పొద్దున్నే పెళ్లనగా యువతి సూసైడ్… వరుడు?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో అపురూపమైన వేడుక. అలాంటి పెళ్లిని ఎంతో ఆనందంగా, వేడుకగా నిర్వహించుకుంటారు. ఈ తరహాలోనే తెల్లారగానే పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఒక జంట విషయంలో అనుకోని సంఘటన ఎదురైంది. వరుడి ఇంటిముందు యువతి ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు, కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్ లోని ముజఫ్ఫర్ నగర్‌కి చెందిన యువకుడు, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి తో ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న వీరి ప్రేమ ప్రయాణంలో ఆ యువకుడు తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అయితే తను ప్రేమించిన అమ్మాయి పై మోజు తీరడంతో తనని వదిలేసి మరొక యువతితో పెళ్ళికి సిద్ధమయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి ఆ యువకుడిని నిలదీయగా అతనిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో తనను ప్రేమించి మోసం చేసి మరొక అమ్మాయి తో పెళ్లికి సిద్ధమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఏకంగా ఆ యువతి పొద్దున్నే పెళ్లి అనగా ఆ యువకుడి ఇంటి ముందుకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.

వెంటనే స్థానికులు స్పందించి ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. తనను ప్రేమించే మోసం చేశాయి మరొక యువతితో పెళ్లికి సిద్ధమైనట్లు ఆ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్లు రామ్ రాజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్
సత్యేంద్ర నగార్ తెలిపారు..