Maruthi : మారుతి తెరకెక్కించిన సినిమాలో నటించింది. అదే మహానుభావుడు. ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్ నటించాడు మంచి హిట్ గా నిలిచింది. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది కూడా. అయితే మొదటి సినిమా అంత భారీ సక్సెస్ వెంటనే మెహ్రీన్ కి దక్కలేదు. మొదటి సినిమాలో ట్రెడీషనల్ లుక్ లో డీసెంట్ గా కనిపించిన ఈమె తర్వాత సినిమాల కోసం మోడరన్ హీరోయిన్ గా మారిపోయింది.
దాంతో మెహ్రీన్ గ్లామర్ హీరోయిన్ అనే పేరు దక్కించుకుంది. ఇండస్ట్రీకి గ్లామర్ హీరోయిన్స్ చాలా అవసరం. అందుకే మెహ్రీన్ వరుసగా గ్లామర్ పాత్రల్లో నటించే అవకాశం అందుకుంది. ఈ వరుసలో మంచి హిట్స్ కూడా తన అకౌంట్ లో వేసుకుంది. కానీ టాలీవుడ్ కి వేరే హీరోయిన్స్ వచ్చి క్రేజ్ సంపాదించుకున్న కారణంగా ఇప్పుడు మెహ్రీన్ కెరీర్ చాలా స్లో అయింది. మళ్ళీ ఊపందుకోవాలని తెగ ట్రై చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఎఫ్ 3 లో తమన్నాతో కలిసి నటిస్తోంది. వరుణ్ తేజ్ కి జంటగా సక్సెస్ అందుకుంటుందని నమ్మకంగా ఉంది.
Maruthi : మారుతీ తెరకెక్కించనున్న సినిమాలో మెహ్రీన్ హీరోయిన్..!
అయితే యంగ్ దర్శకుడు మారుతీ తెరకెక్కించనున్న సినిమాలో ఇప్పుడు మెహ్రీన్ హీరోయిన్ అని ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’ చిత్రం లో నటించి మంచి హిట్ సాధించిన యంగ్ హీరో సంతోష్ శోభన్ తో దర్శకుడు మారుతీ సినిమా రూపొందించనున్నాడట. షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో సంతోష్ శోభన్ కి జంటగా మెహ్రీన్ నటిస్తుందట. ఎఫ్ 3 అలాగే మారుతి – సంతోష్ శోభన్ సినిమాలు హిట్ అయితే ఇక మళ్ళీ మెహ్రీన్ ఫుల్ ఫాంలోకి వస్తుందని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!