సురేఖ వాణి.. పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కొంతమంది అలాగే అనుకుంటారు కూడా. ఎన్నో తెలుగు సూపర్ హిట్ సినిమాలలో చక్కటి పాత్రలు చేసింది. బయట మాత్రం హాట్ ఆంటీ అన్న టాక్ ఉంది. ఈ పేరు రావడాకినికి కారణం సినిమాలలో ఎలాంటి పాత్రలు చేసినా బయట మాత్రం గ్లామర్ గా, హాట్ గా హీరోయిన్స్ రేంజ్ లో జనాలకి కనపడటమే. కూతురు విషయంలో సురేఖ వాణి చాలా స్పీడ్ గా ఉంది. హీరోయిన్ ని చేస్తుందేమో అని.. గత కొంతకాలంగా చాలామంది అనుకుంటున్నారు.
అలా ఎందుకు అనుకుంటున్నారో ఈపాటికే మీకు అర్థమై ఉండాలి. హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఈ అమ్మాయిలో ఉన్నాయి. ఇక తాజాగా సురేఖ వాణి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తుందా అని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ కోసం సురేఖ వాణి ని నిర్వాహకులు క్వారెంటైన్ లో ఉంచారని సమాచారం..! ఇదే విషయం సురేఖ వాణి కూతురును అడిగితే .. అడిగున వాళ్ళకే మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం వచ్చింది. ఇది ఎలా అర్థం చేసుకోవాలి.. అని జనాలందరూ అలోచనలో పడ్డారు.
సుప్రిత తన పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా లైవ్ కు వచ్చింది. లైవ్ చాట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. భవిష్యత్తు లో పెళ్లి నుండి సినిమాలో నటించే విషయం వరకు.. చాలానే చెప్పింది. అమ్మ సురేఖ వాణి బిగ్ బాస్ ఎంట్రీ గురించి కూడా చాలా మంది అడిగారు. అమ్మ నాకు ఆ విషయం ఏమీ చెప్పలేదు. మీకు ఏమైనా చెప్పిందా.. రివర్స్ ఫన్నీగా క్వశన్ చేసింది సుప్రిత. అంతే ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్.
సురేఖ బిగ్ బాస్ ఎంట్రీ విషయంను కుటుంబ సభ్యులు ఎవరు కూడా రివీల్ చేయకూడదు.. ఇదే ఇప్పుడు చిన్న క్లారిటి. మొత్తానికి క్లారిటీ ఇచ్చింది కూతురే అని అంటున్నారు. అమ్మ షో కు వెళ్లడం లేదని సుప్రిత చెప్పకుండా నాకు తెలియదు అంటూ ఇండైరెక్ట్ గా చెప్పిన సమాధానం లోనే సమాధానం ఉందని.. ఇది డీప్ గా ఆలోచిస్తేనే గాని అర్థమవుతుంది. మొత్తానికి సురేఖ వాణి బిగ్ బాస్ లో ఉండబోతుందని చాలా మంది ఫిక్స్ అవుతున్నారు. అంతే కాదు సురేఖ వాణి కూతురిని కొంత మంది మేకర్స్ హీరోయిన్ గా అడుగుతున్నట్టు తెలుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!