Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో విభిన్నమైన పాత్రలతో అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. హీరోగా అదే విధంగా విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు చేసి వెండితెరపై తన నటనతో ప్రేక్షకుల ఆదరణ సంపాదించాడు. ఇక గత ఏడాది బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అద్భుతమైన ఆట తీరుతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. ఏకంగా బిగ్ బాస్ తోనే గేమ్ ఆడి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టాప్ త్రీ స్థానాన్ని సంపాదించిన గాని అంతకుమించి బయట అభిమానాన్ని శివాజీ పొందుకోవటం జరిగింది. వ్యక్తిత్వ పరంగా శివాజీ ఎంత మెచ్యూరిటీ కలిగిన వాడో…కూడా బిగ్ బాస్ షో ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో శివాజీ అద్భుతమైన చాణక్యుడిగా రాణించాడు. ఇక షో అయినా అనంతరం 90’s వెబ్ సిరీస్ తో మధ్యతరగతి కుటుంబానికి చెందిన స్కూల్ మాస్టర్ గా అద్భుతమైన నటనతో శివాజీ మెప్పించారు. ప్రస్తుతం వరుస అవకాశాలతో మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ స్టార్ హీరో సినిమాలో శివాజీ విలన్ పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. దర్శకుడు బోయపాటి శ్రీను తో … మంతనాలు జరిపినట్లు ఒక మంచి విలన్ పాత్ర ఉంటే తనకు ఇవ్వమని అడిగినట్లు అందుకు బోయపాటి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
బోయపాటి దర్శకత్వంలో ఒకప్పటి సీనియర్ హీరోలు జగపతిబాబు, శ్రీకాంత్ లను విలన్ పాత్రలలో అద్భుతంగా చూపించి వారికి ఇప్పుడు మంచి మార్కెట్ క్రియేట్ చేయడం జరిగింది. అదే రకంగా శివాజీ కూడా బోయపాటి సినిమాలో విలన్ పాత్ర చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.