NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ, జనసేనదే – చంద్రబాబు

Chandrababu: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ఆరంభమైందనీ, జగన్ ను ఓడించడానికి జనం సిద్దంగా ఉన్నారని, జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ – జనసేన పార్టీదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పీలేరులో టీడీపీ నిర్వహించిన ‘రా కదిలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజా కోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారన విమర్శించారు. ఆయనకు అభ్యర్ధులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి టీడీపీ, జనసేన సిద్దమని ఆయన తెలిపారు. వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల అని ప్రశ్నించాలన్నారు. వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు ఛిత్రమయ్యాయని తెలిపారు. నాడు అదే బడ్జెట్, నేడు అదే బడ్జెట్ అని అంటున్న జగన్ పన్నులు ఎందుకు వేశారని ప్రశ్నించారు. అప్పులు ఎందుకు చేశావు జగన్ అని నిలదీశారు. చేసిన అప్పులు ఎవరు కడతారు అని ప్రశ్నించారు. దోచిందంతా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్కిస్తామని చంద్రబాబు అన్నారు.

ఎన్నికల  తర్వాత వైసీపీ జెండా పీకేయడం ఖాయమని అన్నారు చంద్రబాబు. గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారని, ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ధి ఏమిటి. ఒక్క ప్రాజెక్టు కట్టాడా. ఒక్క పరిశ్రమ తెచ్చాడా అని ప్రశ్నించారు. తాను రాయలసిమ బిడ్డనే, నాలో ప్రవహించేది రాయలసీమ రక్తమేనని చంద్రబాబు అన్నారు. టీడీపీ అయిదేళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ.12,500 కోట్లు ఖర్చు చేశామని, ఈ అయిదేళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.

పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలంకు ద్వారా 120 టీఎఁసీలు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. తవ్విన కాలువలు పూర్తి చేసి ఈ నీటిని తెస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని అన్నారు. రాయలసీమను పంట్ల తోటలకు హబ్ గా చేయాలని కృషి చేశానని అయితే దుర్మార్గులు అంతా నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల్లో జగన్ పీహెచ్ డీ చేశాడని విమర్శించారు. రూ.10లు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడమే ఆయన పాలసీ అని విమర్శించారు.

YS Jagan: ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే – వైఎస్ జగన్

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri