టాలీవుడ్ మోస్ట్ ఎగ్జయిటింగ్ మూవీగా `RRR` చిత్రం రూపొందుతుంది. నిర్మాత డి.వి.వి.దానయ్య 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన ప్రెస్‌మీట్ రేపు జరగనుంది. సినిమాకు సంబంధించిన పలు విషయాలను దర్శక నిర్మాతలు, హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రాంచరణ్ వివరించనున్నారు. అయితే కొన్ని రోజుల ముందు ఈ సినిమాలో రాంచరణ్ జతగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే నిజానికి రాజమౌళి సంప్రదించిన మాట నిజమేనని.. అయితే అలియాభట్ నో చెప్పిందని వార్తలు కూడా వచ్చాయి. మరో వైపు అలియా భట్ భారీ రెమ్యునరేషన్ కారణంగా రాజమౌళి ఆమెను తన సినిమాలో వద్దని అనుకున్నాడని వార్తలు వినిపించాయి. అయితే అలియా భట్ నో చెప్పడానికి రెమ్యునరేషన్ కారణమే కాదట. ఏప్రిల్ 19న ఆమె నటించిన కళంక్ సినిమా విడుదల కావాల్సి ఉంది. అలాగే సఢక్ 2, తక్త్ చిత్రాల్లో నటించాల్సి ఉంది. అశ్విన అయ్యర్ సినిమాను కూడా ఓకే చేయాల్సి ఉంది. ఇంత టైట్ షెడ్యూల్లో `RRR` చేయడం కష్టమని భావించి.. సున్నితంగా తిరస్కరించిందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయంపై రాజమౌళి అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!