బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ట్విట్టర్ ద్వారా ఆయన తీపి కబురు చెప్పారు. తాను కొత్త చిత్రం `పృథ్వీరాజ్` అనే చిత్రంలో నటించబోతున్నట్లు ప్రకటించారు. “నా జీవితంలో తొలిసారి హిస్టారికల్ చిత్రంలో నటించబోతున్నాను. గొప్ప ధైర్యసాహసాలున్న, విలువలున్న పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. నా అదృష్టంగా భావిస్తున్నాను. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై డా.చంద్రశేఖర్ ద్వివేది దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాను. వచ్చే ఏడాది దీపావళికి సినిమా విడుదలవుతుంది“ అన్నారు.