సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ భాగం నమ్మకంపైనే పనులు నడుస్తుంటాయి. లేకుంటే హిట్ కావాల్సిన హీరో.. ప్లాప్ డైరెక్టర్‌తో జత కట్టడమేంటి? వివరాల్లోకెళ్తే.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు.. స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. రీసెంట్గా విడుదలైన `ఏబీసీడీ` కూడా అంతంత మాత్రం ఫలితాన్నే ఇచ్చింది. ఎలాగూ మంచి బ్యాగ్రౌండ్ ఉంది కదా!. మంచి బ్రేక్ కోసం హిట్ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడేమోనని అనుకుంటున్న తరుణంలో, ఓ షాకింగ న్యూస్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే అల్లు శిరీష్, ప్రేమ్‌సాయి అనే డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడట. గతంలో నితిన్‌తో `కొరియర్‌బాయ్ కల్యాణ్` అనే ప్లాప్ సినిమా చేశాడు. మరి ఈ ప్లాప్ డైరెక్టర్, శిరీష్‌కు ఎలాంటి హిట్ ఇస్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!