F3: నటసింహం నందమూరి బాలయ్య బాబు గతంలో మాదిరిగా కాకుండా చాలా కలివిడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో “ఆహా” డిజిటల్ ప్లాట్ ఫామ్ లో.. “అన్ స్తాపబుల్” టాకీషో చేయడం తెలిసిందే. ఫస్ట్ టైం బాలకృష్ణ హోస్ట్ గా చేసిన గాని… అదరగొట్టేసారు. దీంతో ఇండియాలోనే “అన్ స్తాపబుల్” టాకీషో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. బాలకృష్ణ ఈషో చేయడం వల్ల ఆహాకి కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. ఇదే తరుణంలో ఏదైనా సినిమా రిలీజ్ అయితే.. సోషల్ మీడియాలో స్పందించకపోయినా గాని.. విడుదలైన సినిమాని సినిమా యూనిట్ తో పాటు ప్రత్యేకంగా చూసి బాలకృష్ణ ఇటీవల అభినందిస్తూ వస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ రకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. “సర్కారు వారి పాట” సినిమా యూనిట్ నీ అభినందించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన “F3″ సినిమాని బాలకృష్ణ ప్రత్యేకంగా చూడటం జరిగిందట. సినిమా బాగుందని అదిరిపోయే కామెడీ టైమింగ్.. స్టోరీలో ఉందని దర్శకుడు పనితనం చాలా బాగుంది అంటూ.. అనిల్ రావిపూడి ని బాలయ్య అభినందించారు.
ఇదే సమయంలో సినిమాను చూసిన కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా…”F3” సినిమా యూనిట్ నీ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ బాలకృష్ణతో అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ నీ చాలా వైవిధ్యమైన పాత్రలో అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు అని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం 50 సంవత్సరాల ముసలి వ్యక్తిగా బాలయ్య ఈ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో తన పంచ్ డైలాగులతో… అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేసినట్లు.. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!