Tollywood villains: ఒకప్పటి సినిమాలలో హీరో హైలెట్ కావాలంటే ఆ సినిమాలో హీరో విలన్ ను చితకబాదేసిన చాలు ఆ సినిమాఎంతో క్రేజ్ ని సంపాదించుకుంటుంది. కానీ ప్రస్తుతం హీరోయిజంతో పాటు, విలనిజం కూడా గట్టి పోటీ ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. హీరో, విలన్ ను మైండ్ గేమ్ ఆడుతూ పతనం చేస్తుంటే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లను వెతకడం ఒకెత్తయితే, విలన్ పాత్రలో నటించడానికి హీరోకి సరైన జోడీని వెతకడం కష్టంగా మారింది. అందుకోసమే ఈ మధ్యకాలంలో ఇప్పుడిప్పుడే హీరోలుగా మంచి పేరు సంపాదించుకున్న వారిని విలన్ గా పెట్టి సినిమాలు తీస్తున్నారు. అయితే కొన్ని సినిమాలలో హీరో పాత్ర కన్నా విలన్ పాత్రలు ఎంతో హైలెట్ గా నిలిచాయి. మరి హీరోల కన్నా విలన్లు కీలక పాత్ర పోషించిన ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..?
1)మాస్టర్:
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మాస్టర్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ తళపతి కన్నా, విలన్ పాత్రలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో హీరో పాత్ర కన్నా విలన్ పాత్రని చూస్తూ ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు.
2) ధ్రువ:
ధ్రువ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ను మైండ్ గేమ్ తో ఆడుకుంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాడు విలన్ అరవింద్ స్వామి. ఈ సినిమాలో కూడా విలన్ పాత్ర ఎంతో హైలెట్ గా నిలిచింది.
3) అభిమన్యుడు:
విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించిన అర్జున్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.
4) బాహుబలి 1:
రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 1 సినిమాలో విలన్ పాత్రలో రానా అద్భుతంగా నటించారు.
5) వర్షం:
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వర్షం సినిమాలో విలన్ పాత్రలో గోపీచంద్ ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ కు హీరోగా అవకాశాలు వచ్చాయి.
6) జులాయి:
ఒకే సినిమాలో హీరో,విలన్ ఆలోచన పద్ధతులు ఒకే విధంగా ఉంటే ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ విధంగానే జులాయి సినిమాలో సోను సూద్, బన్నీ ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కన్నా సోనుసూద్ డామినేషన్ ఎక్కువగా ఉంది.