NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP : మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై వైసీపీలో కొనసాగుతున్న కసరత్తు..రేపు ఉదయం జాబితా విడుదల

YSRCP : ఏపిలో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల మేయర్, డిప్యూటి మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ‌ల ఎన్నిక ఈ నెల 18వ తేదీ (గురువారం) జరుగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెండు మున్సిపాలిటీలు తాడిపత్రి, మైదుకూరు మినహ 11 కార్పోరేషన్ లు, 73 మున్సిపాలిటీలలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. అయితే ఆయా కార్పోరేషన్ లు, మున్సిపాలిటీలకు సంబంధించి  మేయర్, డిప్యూటి మేయర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ ల జాబితా ను నేడు వైసీపీ ప్రకటిస్తుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే జాబీతాపై ఇంకా కసరత్తు పూర్తి కానందున మేయర్, చైర్మన్ ల జాబితా ప్రకటన వాయిదా పడింది.

YSRCP  sajjala Ramakrishna reddy
YSRCP sajjala Ramakrishna reddy

ఈ సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక 70 శాతం వరకూ పూర్తి అయ్యిందన్నారు. ఎంపిక ప్రక్రియ నూరు శాతం పూర్తి కానందు వల్ల అభ్యర్థుల జాబితా ప్రకటించడం లేదని చెప్పారు. గురువారం ఉదయం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. పురపాలక పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మైనార్టీ, మహిళలకు పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రాధాన్యత  ఇచ్చారని పేర్కొన్నారు. మైదుకూరు, తాడిపత్రి లో ఇరు పార్టీలు సమంగా నిలిస్తే టాస్ ద్వారా చైర్మన్ ఎన్నిక చేపడతారని అన్నారు. ఇతరులను ప్రలోభ పెట్టవద్దనీ, అధికార దుర్వినియోగం చేయవద్దని సీఎం జగన్ ఆదేశించారని సజ్జల తెలిపారు.

YSRCP  sajjala Ramakrishna reddy
YSRCP sajjala Ramakrishna reddy

కాగా  పార్టీలో నేతల మధ్య విబేదాలు ఉన్న చోట్ల సీఎం జగన్ స్వయంగా అభ్యర్థిని ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో లేని విధంగా ఈ సారి పురపాలక సంఘాల్లో రెండేసి డిప్యూటి మేయర్లు, ఇద్దరు వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించారు. దీంతో మేయర్, చైర్మన్ ల పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆ పదవులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే డిప్యూటి మేయర్, వైస్ చైర్మన్ పదవులతో సంతృప్తి పరిచే అవకాశం ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N