ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు స్టార్ మా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ని స్టార్ట్ చేసేసింది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్ లు పూర్తికాగా వాటిలో 16 మంది కంటెస్టెంట్ ల మధ్య గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో షో రసవత్తరంగా మారింది. ఎవరికి వారు సీజన్ త్రీ లో శివ జ్యోతి మాదిరిగా….. మగవాళ్ళు, ఆడవాళ్ళు అనే తేడా లేకుండా ఏడుపుతో రక్తికట్టించేస్తున్నారు. ఈలోపే మొదటివారం ఎండింగ్ రావటంతో షో నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే దాని విషయంలో సోషల్ మీడియాలో డిస్కషన్ లు తారాస్థాయిలో జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ కి ఇంటి సభ్యులు అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్, దివి, మెహబూబా, సుజాత నామినేట్ అవ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నిర్వహిస్తున్న పోలింగ్ ప్రకారం ఎక్కువ శాతం పోల్స్ లో గంగవ్వ, అభిజిత్, మెహబూబ్ లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ వారం హౌస్ నుండి సూర్యకిరణ్ అదేవిధంగా దివి ఇద్దరూ ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
మరోపక్క ఎవరు వెళ్లినా వెళ్లకపోయినా మొదటి వారంలో సూర్యకిరణ్ వెళ్లిపోవటం గ్యారెంటీ అనే టాక్ మాత్రం గట్టిగా వినపడుతోంది. చాలా వరకు సూర్య కిరణ్ కన్నింగ్ గేమ్ ఆడుతూ ఇంటి సభ్యుల మధ్య గొడవలకు కారణమవుతున్నాడని ప్రేక్షకులు మరియు నెటిజన్లు భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ విపరీతంగా ఉందట. దీంతో షో నుండి సూర్య కిరణ్ వెళ్ళిపోవటం దాదాపు ఖాయమేనని చాలా మంది భావిస్తున్నారు.