బిగ్బాస్ వీకెండ్ వచ్చింది అంటే చాలు ఒకసారిగా రేటింగ్ తారాస్థాయికి చేరుతోంది. ఒకరోజు తీయగా మాట్లాడి నాగార్జున మరొక రోజు ఘాటుగా మారుతున్నాడు. సభ్యులతో తనకు నచ్చినట్లు పర్ఫార్మెన్స్ తెప్పించ్కొని షో ఎదుగుదలకి సహాయం చేస్తున్నారు. శనివారం తప్పులను ఎత్తిచూపుతూ నాగార్జున కంటెస్టెంట్స్ కి ఊహించని విధంగా షాక్ లు ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి విడివిడిగా క్లాస్ పీకుతూ అవసరమైన మేరకు కోప్పడుతూ అందరినీ రెచ్చగొడుతున్నాడు.
ఇదే వరుసలో అటు అవినాష్ ఇటు సోహెల్ విషయంలో నిన్న నాగార్జున ప్రవర్తించిన తీరు చూస్తే ఎవరైనా శభాష్ అనాల్సిందే. ముందుగా తన కోపాన్ని నియంత్రించుకున్నందుకు అతనిని అభినందించాడు. నువ్వు నా మాటకి కట్టుబడి ఉన్నందుకు సంతోషం కానీ అవినాష్ ఇలాంటి కామెడీ పీస్ అన్న మాటలకు అంత కోపం పడవలసిన అవసరం లేదు అని అన్నాడు. అలాగే నువ్వు కోప్పడకుండా చెడు మాటలు మాట్లాడకుండా నువ్వు చెప్పదలుచుకున్న విషయాన్ని బయటకు చెప్పేసెయ్అని సూచించాడు.
వెంటనే అవినాష్ ఎక్కడ నొచ్చుకుంటాడో అన్నట్లు ఇంటిలో నీ కంటే ఎంటర్టైనర్ లేడు అని ఒక పెద్ద బిరుదుని అతనికి ఇచ్చేశాడు. ఆ తరువాత అతనికి కూడా లైట్ గా అక్షింతలు వేసాడు. సోహెల్ తన కోపాన్ని తగ్గించుకుని శాంత స్వభావి గా మారితే అది టిఆర్పి రేటింగ్స్ కు ఏమాత్రం హెల్ప్ అవ్వదు. అలాగే అవినాష్ ని కామెడీ పీస్ అంటే అవినాష్ కామెడీ చేయడం మానేస్తాడు కాబట్టి తన మనసులోని మాటను నిర్భయంగా సోహెల్ కి చెప్పమని ప్రోత్సహించి అవినాష్ కు ఇలా బెస్ట్ కమెడియన్ అని బిస్కెట్ వేసినట్లు నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఒక షోకి హోస్ట్ గా ఇంతకన్నా తెలివిని ఎవరూ ప్రదర్శించరు అని అంటున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!