మలయాళం బ్లాక్ బస్టర్ “లూసిఫర్” సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా ఈ సినిమాకి డైరెక్టర్ గా “సాహో” ఫేమ్ సుజీత్ నీ డైరెక్టర్ గా తీసుకోవాలని అనుకున్నరు. ఇదే విషయాన్ని సుజిత్ తో పాటు చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశారు. మెగాస్టార్ తో సినిమా చేసే ఛాన్స్ రావడంతో అప్పట్లో ఈ యంగ్ డైరెక్టర్ పొంగిపోయారు.
అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే. ఈ ప్రాజెక్టు నుండి సుజిత్ నీ మెగాస్టార్ పక్కన పెట్టిరట. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ కన్ఫామ్ చేశారు. దీంతో “లూసీఫర్” సినిమా కి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. కొత్తగా సుజిత్ కి పెళ్లి అవటంతో సినిమా ప్రాజెక్టు పై అంతగా కాన్సెంట్రేషన్ చేయలేక పోతున్నట్లు తెలపటంతో రిస్క్ ఎందుకులే అని డైరెక్టర్ ని మార్చాల్సి వచ్చిందని చిరంజీవి ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
అయితే మరోపక్క అసలు విషయం అది కాదు అన్న టాక్ ఫిలిం నగర్ లో వస్తుంది. ఒరిజినల్ వెర్షన్ కు మార్పులు చేయటం విషయంలో చిరంజీవిని సుజిత్ మెప్పించలేకపోయినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో రిస్కు అనవసరమని మెగా టీం పూర్తిగా డైరెక్టర్ ని మార్చడం జరిగినట్లు ఇన్సైడ్ టాక్.