టాలీవుడ్లో డ్యాన్స్ మాస్టర్స్‌కు క్రేజ్ పెరిగింది. ఈతరం హీరోలు డ్యాన్సులకు ఇచ్చే ప్రాముఖ్యత.. డ్యాన్స్ షోలు, స్టేజ్ షోలు వెరసి డ్యాన్స్ మాస్టర్స్‌కు మంచి గుర్తింపు దొరుకుతుంది. చిన్న చితకా వారికే మంచి గుర్తింపు దొరుకుతుంటే… చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్ వంటి వారికి కొరియోగ్రఫీ చేసే మాస్టర్‌కు ఎలాంటి గుర్తింపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇలాంటి స్టార్స్ సినిమాలకు కొరియోగ్రఫీ అందించే జానీ మాస్టర్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే ఓ చెక్‌బౌన్స్ కేసులో మేడ్చల్ కోర్టు ఈయనకు జైలు శిక్ష వేసిందట. మూడు సెక్షన్స్ క్రింద కేసు నమోదు అయితే.. ఓ సెక్షన్‌ను పరిగణించకుండా.. మిగతా రెండు సెక్షన్స్ క్రింద జానీ మాస్టర్‌కు ఆరు నెలలు జైలు శిక్ష విధించిందట కోర్టు. మరిప్పుడు జానీ మాస్టర్ ఏం చేస్తాడో చూద్దాం..
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!