Salar: 2023వ సంవత్సరంలో విడుదలై సెన్సేషన్ సృష్టించిన సినిమాలలో ” సలార్ ” కూడా ఒకటి. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కి చాలామంది ఫిదా అయ్యారు కూడా. ఈ సినిమాలో మౌనం పాటిస్తూనే ఒక్కొక్కడిని ఊచ కోత కోశాడు ప్రభాస్.
ఇక ఈ మూవీ తాజాగా ఓటీటీ లోకి కూడా వచ్చి ప్రేక్షకులని మరింత ఉత్సాహపరుస్తుంది. ఇక శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అలానే ఈ మూవీ రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం పెద్ద సెన్సేషన్ సృష్టించిందనే చెప్పొచ్చు. ఇక రెండో భాగం ఏ విధమైన రికార్డ్లను నెలకొల్పుతుందో చూడాలి మరి.
ఇక ఈ సినిమా కన్నా ముందు షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ” డంకీ ” మూవీ రిలీజ్ అయినప్పటికీ సలార్ లేటుగా రిలీజ్ అయిన లేటెస్ట్ గా రిలీజ్ అయినట్లు ఊచకోత కోసింది. దీంతో ఈ సినిమా రికార్డుల దుమ్ము దులిపింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 750 కోట్ల వరకు కలెక్షన్స్ను రాబట్టింది సలార్ మూవీ.
ఇక 2 గంటల 55 నిమిషాల విడివితో సాగే ఈ సినిమాలో మొత్తం కలుపుకుంటే రఫ్ గా 4 నిమిషాల్లోపే ప్రభాస్ డైలాగ్స్ ఉన్నాయని.. మధ్యలో ఉన్న గ్యాప్స్ కూడా తొలగిస్తే మొత్తంగా 2:35 సెకండ్ల డైలాగ్స్ మాత్రమే ప్రభాస్ కు..ప్రశాంత్ నీల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కేవలం ఈ కొద్ది సమయంలోనే ప్రభాస్ తన డైలాగులతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు. ఇది ఒక్క ప్రభాస్ కి మాత్రమే సాధ్యం అంటున్నారు ఫ్యాన్స్. తన కంటి చూపుతో ఓవరాల్ గా భారీ కలెక్షన్స్ ను రాబట్టాడు ప్రభాస్. ఇక సెకండ్ పార్ట్ లో కూడా ప్రభాస్ కి ఏమన్నా డైలాగులు ఎక్కువ రాస్తారో లేదో చూడాలి మరి.