ఒక పక్క నిర్మాణంలో ఉండగానే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయంటే.. సినిమాకు ఉన్న క్రేజ్ ఆ రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఆఫ్ టాలీవుడ్ `RRR`. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోల కలయికతో రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తవుతున్నాయి.. కోల్‌కత్తాలో మరో షెడ్యూల్‌కు ప్లానింగ్ జరుగుతుంది. మరో పక్క మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. 300 కోట్ల ఖర్చుతో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. సినిమాకు కూడా అదే రేంజ్ క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా హక్కుల కోసం భారీ డిమాండ్ ఉంది. ఇలాంటి తరుణంలో మేకర్స్ సినిమా ఓవర్సీస్ హక్కులను 75 కోట్ల రూపాయలని చెబుతున్నారట. మరి ఇంత భారీ ధర చెల్లించి ఎవరు ఓవర్సీస్ హక్కులను దక్కించుకుంటారో చూడాలి. రీసెంట్గా అమ్ముడైన సాహో ఓవర్ సీస్ హక్కులకు ఇది దాదాపు రెట్టింపు ధర.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!