అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి జరిగి ఆదివారానికి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సమంత తన భర్త చైతన్యతో కలిసి ఉన్న వివిధ సందర్భాల్లోని ఫొటోలను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అలాగే చైతుతో సామ్ డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా పోస్ట్ చేశారు. “మా ప్రేమ మరింత బలపడింది. రెండో వార్షికోత్సవం.. పదేళ్ల ప్రేమకథ. నీ ప్రేమకు బందీనయ్యా చైతన్య“ అని ఎమోషనల్ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు వీరిద్దరికీ అభినందనలు తెలిపారు. అలాగే త్రిష, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, స్నేహారెడ్డి, నమత్ర, లావణ్య త్రిపాఠి, నీరజ కోన, నందినీ రెడ్డి తదితరులు వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.
previous post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!