NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: దివ్యను ఖుషి చేసిన నందు..! ప్రేమ్ సంగతి తేల్చాలని బయలుదేరిన తులసి..! 

Intinti Gruhalakshmi: ప్రేమ్ ఇంట్లో లేక ఇల్లు వెలవెలబోతున్న విషయం హోలీ తో అందరికీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది..! దివ్య ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేస్తుంది.. అలా లాస్య కు రంగులు పూయబోగా చిరాకుగా ఈ వేషాలు మీ అమ్మ దగ్గర వేసుకో.. నా దగ్గర కాదు అవతలికి పో అని అంటుంది లాస్య.. దివ్య ఏడుపు మొఖం చూసినా నందు ఏమ్మా దివ్య ఈ నాన్న కు రంగులు పూయకుండనే హోలీ చేసుకుంటున్నావా.. రంగులు పూయమ్మా అంటాడు.. దాంతో దివ్య పెదాలపై రంగులు పూస్తాయి..!

Intinti Gruhalakshmi: Serial 25 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 25 March 2022 Today Episode Highlights

ప్రేమ్ ఇంట్లో లేకపోవడంతో అభి హోలీ జరుపుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని అంకిత ప్రేమ్ దగ్గరికి మనం వెళ్లి హోలీ చేసుకుందాం అని అంటుంది. అమ్మకు తెలిస్తే మన గతి కూడా ప్రేమ్ లాగానే అవుతుంది అని అంటాడు అభిని. మనం ఏమైనా చెప్పి వెళతామ అని దివ్య వత్తాసు పలుకుతోంది. అలా ముగ్గురు కలిసి రంగుల ప్లేట్ పట్టుకుని బయటకు వెళ్తూ ఉండగా.. వాళ్ళ నానమ్మ తాతయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుండగా.. తులసి ఎక్కడికి అని అడుగుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి హోలీ ఆడుకోడానికి వెళ్తున్నాము. అభి అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు అని దివ్య చెబుతోంది. ఈ ఇంట్లో ఉంటే ప్రేమ్ తో హోలీ ఆడుకున్న క్షణాలు గుర్తుకొస్తున్నాయి అని అభి అంటాడు.. సరే వెళ్లి త్వరగా హోలీ ఆడుకొని వచ్చేసేయండి అని చెబుతుంది. సంతోషంగా అభి, అంకిత, దివ్య ముగ్గురు కలిసి ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ప్రేమ్ వాళ్ళు వెళ్ళగానే హోలీ శుభాకాంక్షలు చెప్పి ఇక్కడికి రావడానికి అమ్మ ఒప్పుకుందా అని అంటాడు. దివ్య చెప్పే వచ్చాము అని చెబుతోంది. ఇక అందరూ రంగుల లో మునిగి తేలతారు..

 

తులసి మాధవి కి ఫోన్ చేసి ప్రేమ్ వాళ్ళింటికి వెళ్తాను అని అంటుంది . ఏంటి వదినా వాడిని ఇంటికి తీసుకు వచ్చేయాలి అని అనుకుంటున్నావా అంటుంది. వాడు బాగుపడతాడని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాను. వాడి ఆశయం మర్చిపోయి ప్రవర్తిస్తే నేను వదిలిపెట్టను. చెట్టు వంగడానికి ఒక గొడ్డలి పోటు వేస్తే సరిపోదు మాధవి.. అది వంగే వరకు నరుకుతునే ఉండాలి. ఇప్పుడు నేను చేసేది కూడా అదే అని అంటుంది. నన్ను ప్రేమ్ వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తవ అని అడుగుతుంది. సరే అయితే ఇప్పుడే అర్జెంటుగా బయలుదేరి వచ్చేయి అని అంటుంది. మాధవి ఆటోలో వచ్చి తులసికి ఫోన్ చేస్తుంది. అలా ప్రేమ్ వాళ్ళింటికి వాళ్ళిద్దరూ బయలుదేరుతారు. ప్రేమ్ హోలీ ఆడటం చూసిన తులసి నీ ఆశయం మర్చిపోయావా.. ఈ అమ్మకు ఇచ్చిన మాట నీకు గుర్తుందా..!? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా.!? నిన్ను అడిగే హక్కు నాకు లేదా..!? అంటూ చెడామడా వాయిస్తుంది. ఈ అమ్మ నిన్ను అడిగే హక్కు లేదంటే చెప్పు.. ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను. నాకు ఒక్క కొడుకు ఉన్నాడు అని అనుకుంటాను అంటుంది తులసి. ప్రేమ్ వాళ్ళ అమ్మకు ఏమని బదులిస్తాడో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar