మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కల్యాణ్‌దేవ్ సైబర్ సెల్‌ను సంప్రదించారు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆయన్ని కొందరు ఆటపట్టిస్తున్నారట. అంతేకాకుండా ఆయన కుటుంబసభ్యులను కూడా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారట. ఈ విషయం గురించి కల్యాణ్ దేవ్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారి ఐడీ హ్యాండిల్స్ ను ఆయన పోలీసులకు అందించారు. వాళ్లు ఆ ఐడీలను గుర్తించారు. వాటికి సొంతమైనవారి కోసం ఆరాతీస్తున్నారు. కల్యాణ్‌దేవ్ గతేడాది `విజేత` చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆయన భార్య శ్రీజ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం కూడా తెలిసిందే.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!