లారెన్స్ దర్శకత్వంలో రూపొందతున్న ముని సిరీస్‌కి ప్రేక్షకుల ఆదరణ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ సిరీస్‌లో వచ్చిన ముని, కాంచన, గంగ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్నే అందుకున్నాయి. తాజాగా విడుదలైన ‘కాంచన 3’ కూడా తమిళ్, తెలుగు భాషల్లో భారీ కలెక్షన్స్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ముని సిరీస్‌లో 2011లో వచ్చిన కాంచన తెలుగు, తమిళ్ భాషల్లో పెద్ద విజయం సాధించింది. ఇప్పుడా సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమా రీమేక్ కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అద్వాని జంటగా నటిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి ‘లక్ష్మీ’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!