Raviteja Kota Srinivasrao: సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు( Kota Srinivasrao) ఈ మధ్య వరుస పెట్టి పని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో కోటా శ్రీనివాసరావు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆ మధ్య నటనపరంగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ (NTR) నీ మించిన నటుడు ప్రస్తుత తరం లేరనీ… తారక్ అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో రామ్ చరణ్(Ram Charan) పై నెగిటివ్ కామెంట్లు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మాస్ మహారాజా రవితేజ(Raviteja) పై కోట శ్రీనివాసరావు లేటెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దర్శకులలో రాఘవేంద్రరావుని ఎంత ఇష్టపడతానో అదే రీతిలో.. హీరోలలో రవితేజ అంటే అంత ఇష్టమని తెలిపారు. తన స్టామినా గురించి రవితేజ కి చాలా బాగా తెలుసు, సరిగ్గా స్టోరీలు ఎంచుకోవడం మాత్రమే కాదు మంచి జడ్జిమెంట్ కూడా.. రవితేజ కి ఉంది అంటూ పొగడ్తలు వర్షం కురిపించారు. ఇండస్ట్రీలో జన్యున్ గా కష్టపడే హీరోలలో రవితేజ ఒకరిని తెలిపారు. ముఖ్యంగా ఇడియట్ సినిమాలో రవితేజ నా కొడుకుగా నటించి.. పాత్రలో అద్భుతంగా పరకాయ ప్రవేశం చేసాడు.
ఆ సినిమాలో రవితేజ నటన చూసి చాలా గర్వపడ్డాను. మధ్యతరగతి కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య సహజంగా జరిగే… సీన్స్ ఈ సినిమాలో ఉంటాయి. రవితేజని కొట్టడంతో పాటు రవితేజ స్నేహితులపై చెంబు విసరటం ఆ సీన్స్ థియేటర్ లకి రిపీట్ ఆడియన్స్ తీసుకొచ్చేటట్లు చేశాయి. ఇడియట్ సినిమాలో నాకు రవితేజ కి మధ్య వచ్చే సీన్స్.. హైలెట్. ఏది ఏమైనా నటన పరంగా ఇంకా మనిషి పరంగా కూడా రవితేజ అంటే చాలా ఇష్టం అండి కోట శ్రీనివాసరావు లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.