Krithi Shetty: ఉప్పెన భామ కృతిశెట్టి మొదటి సినిమాతోనే యూత్ కావాల్సిన గ్లామర్ డోస్, స్కిన్ షో ఇచ్చి..ఆకట్టుకుంది. మెగా మేనల్లుడు మొదటి సినిమాలో హైలెట్‌గా నిలిచిన కృతిశెట్టి పర్ఫార్మెన్స్ పరంగా కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. దాంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అరడజను సినిమాలను ఓకే చేసింది. ఇండస్రీకొచ్చిన మొదటి నుంచే గ్లామర్ ఫీల్డ్‌లో ఎలా ఉంటే నెగ్గుకొస్తామో బాగా అర్థం చేసుకుంది. అందుకే నాని సరసన నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో గ్లామర్ డోస్ దంచికొట్టింది.
ఘాటు సన్నివేశాలలో నానిని కూడా డామిబేట్ చేసింది. స్మోక్ చేసే సీన్, నానితో రొమాంటిక్ సీన్స్, పెదవి ముద్దులతో అందరినీ ఆకట్టుకొని చర్చనీయాంశంగా మారింది. చెప్పాలంటే ఈ సినిమాలో సాయి పల్లవి కంటే కృతిశెట్టి గురించే అందరూ మాట్లాడుకున్నారు. అంతగా ఈ సినిమా ఈ యంగ్ బ్యూటీకి పేరు తెచ్చింది. ఇక తను నటిస్తున్న మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంతక ముందు సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దీనికి దర్శకుడు.
Krithi Shetty: కృతిశెట్టితో రొమాన్స్ అంటే హీరోలు తట్టుకునేలా లేరు..!
సుధీర్ బాబు – ఇంద్రగంటి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. కొత్త సంవత్సరం కానుకగా చిత్రబృందం ఈ సినిమా నుంచి సుధీర్ బాబు, కృతిశెట్టిల లుక్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలోను హీరో, హీరోయిన్స్ మధ్య మాంచి ఘాటు సన్నివేశాలున్నాయని తాజాగా వదిలిన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇక పోస్టర్ చూసిన నెటిజన్స్ కృతిశెట్టితో రొమాన్స్ అంటే హీరోలు తట్టుకునేలా లేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి అమ్మడి దూకుడు చూస్తుంటే లాంగ్ టైమ్ ఇండస్ట్రీలో కొనసాగడం గ్యారెంటీ అని తెలుస్తోంది.