Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ పొజిషన్లో ఉన్న టైంలో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. విక్టరీ వెంకటేష్ తో మహేష్ నటించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అనే సినిమాతో టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు రిబ్బన్ కటింగ్ ప్రారంభమయింది. ఆ సినిమా తర్వాత చాలా మంది స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ తరహాలో సినిమాలు తెరకెక్కుతున్నాయి. రానా – పవన్ కళ్యాణ్ మూవీ, రామ్ చరణ్ -ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్”, “ఆచార్య” సినిమాలో చిరంజీవి తో చరణ్ అదేవిధంగా గోపీచంద్ రాజశేఖర్ కాంబినేషన్లో సినిమా ఇలా చాలా రకాల మల్టీస్టారర్ ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో మహేష్ బాబుతో పాటు విజయ్ దేవరకొండ కలసి సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వినబడుతోంది. మేటర్ లోకి వెళ్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలు తీసే డైరెక్టర్లుగా పేరొందిన ఆర్ కె అండ్ డీకే మహేష్ విజయ్ దేవరకొండ తో సినిమా తెలుగులో చేయాలని డిసైడ్ అయినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ మహేష్ బాబు కి బిగ్ ఫ్యాన్ అని తెలుసు. శ్రీమంతుడు సినిమా టైంలో మహేష్ అవార్డు అందుకోవడానికి వచ్చిన సమయంలో తాను ఆడియన్స్ లో ఉన్నట్లు లైఫ్ అంటే మహేష్ లా ఉండాలని అనుకున్నట్లు లో ఆడియో ఫంక్షన్ లో తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు పక్కన నటించడానికి విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నట్లు వార్త రావడంతో ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!