బిగ్ బ్రేకింగ్: మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో నాగబాబు కూడా ఒకరు. తాను రావడమే కాకుండా తన కొడుకు అయిన వరుణ్ తేజ్ ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి మంచి గుర్తింపును దక్కించారు. ఇక ప్రస్తుతం నాగబాబు పవన్ కి సపోర్ట్ గా నిలబడ్డాడు. అదేవిధంగా ఇటీవలే నిహారిక ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ నిర్మాణ సంస్థను చూసుకుంటూ మరోపక్క రాజకీయాల్లో కూడా తన తమ్ముడికి చెయ్యి అందిస్తూ ఉన్నాడు నాగబాబు.
నిజానికి నాగబాబు ఒకానొక సమయంలో హీరోగా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ప్రొడక్షన్ రంగంలోకి దిగాడు. నాగబాబు ఏమైనా హిట్ అవుతాడేమో అని చిరంజీవి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ నాగబాబు మాత్రం డైరెక్టర్ గా హిట్ అవ్వలేదు. దీంతో అలా అడపాదడపా అవకాశాలు అందుకుంటూ సినిమాలలో తండ్రి మరియు ఇతర క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రస్తుతం తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఇక తాజాగా నాగబాబుపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వరుణ్ తేజ్ తాజాగా నటించిన మూవీ ” ఆపరేషన్ వాలెంటైన్ ” పై అందరి దృష్టి మళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. దేశమంతా నమ్మడం ఒక ఎత్తు అయితే ఇంట్లో వారు నమ్మడం మరొక ఎత్తు. కానీ వరుణ్ తేజ్ కి అదే కరువైంది. తనని దేశమంతా నమ్మినప్పటికీ తన తండ్రి మాత్రం నమ్మలేదు. రీసెంట్ టైంలో తన మాటలకంటే ట్వీట్స్ లో ఎక్కువగా వైరల్ అవుతున్న నాగబాబు తాజాగా మరో ట్వీట్ పెట్టాడు. నన్ను క్షమించండి అంటూ బాధపడ్డాడు.
తన కొడుకు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో..” పోలీస్ క్యారెక్టర్ మూడు అడుగుల ఆరు అంగుళాలు ఉన్న వ్యక్తి చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఐదు అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నప్పదు ” అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మాటలని తాను వెనక్కి తీసుకుంటున్నట్లు ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు నాగబాబు. ” ఎవరైనా నోచుకుని ఉంటే ఐయామ్ రియల్లీ సారీ. ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న. అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నా ” అంటూ ఓ ట్వీట్ ద్వారా వాపోయాడు నాగబాబు.