Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కుటుంబానికి సంబంధించి మహేష్ బాబుకు సంబంధించి అనేక ఫోటోలు.. విషయాలు తెలియజేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటది. లేటెస్ట్ గా.. జేమ్స్ బాండ్ లుక్ తరహాలో మహేష్ దిగిన ఫోటోలను నమ్రత పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటోలకు పర్ఫెక్షన్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. బ్లాక్ కళ్లద్దాలతో సూటు బూటు వేసుకొని మహేష్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఈ తరహా లుక్ లోనే సినిమా ఉంటే బాగుండు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఫోటోలలో మహేష్ హాలీవుడ్ హీరో మాదిరిగా ఉన్నారు.
మహేష్ స్టైలిష్ గా ప్రొఫెషనల్ హీరోగా కనిపిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు ముందు ఒప్పుకున్నా యాడ్స్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. మరో నెల రోజుల్లో జక్కన్న సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే స్టోరీ కంప్లీట్ కావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి నటీనటులను ఎంపిక చేస్తూ మరోపక్క వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు రాజమౌళి. “RRR” లాంటి అంతర్జాతీయ హిట్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు నటించే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా కోసం మహేష్ ప్రత్యేకమైన వర్క్ అవుట్ లు కూడా చేస్తున్నారట. ఈ సినిమాకి విదేశీ అమ్మాయి హీరోయిన్ గా నటించబోతున్నట్లూ సమాచారం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ తరహాలో సినిమా స్టోరీ.. కావటంతో యాక్షన్ సన్నివేశాలకు రాజమౌళి పెద్దపీట వేయడం జరిగిందట. ఈ సమ్మర్ లో సినిమా స్టార్ట్ చేసీ.. వచ్చే ఏడాది రిలీజ్ చేసే విధంగా రాజమౌళి షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.