వరుస సినిమాలతో ఖాళీ లేకుండా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటోన్న నాని ఈ నెల 19న జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరో వైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `గ్యాంగ్ లీడర్` సినిమా సెట్స్‌లో ఉంది. కాగా.. నాని తన 25వ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో నాని పాత్ర నెగటివ్ షేడ్స్‌తో ఉంటుంది. నానితో పాటు సుధీర్ బాబు ఇందులో నటిస్తున్నారు. ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకోబోతున్నాడు. ఈ సినిమాలో అదితిరావు హైదరి, నివేదా థామస్ పేర్లు ప్రముఖంగా వినపడ్డాయి. నాని సరసన అదితిరావు హైదరి నటిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో సమంతను తీసుకోవాలని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడట. నిజానికి `96` తెలుగు రీమేక్‌ను నాని, సమంతతో చేయాలని భావించిన దిల్‌రాజుకి నాని డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు. దాంతో ఇప్పుడు మరోసారి దిల్‌రాజు నానితో సమంతను నటింప చేయాలనుకుంటున్నాడు. సమంతతో చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే నాని, సమంత కలిసి ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రాల్లో నటించారు. మరి దిల్‌రాజుకు సమంత ఓకే చెబుతుందో లేదో చూడాలి. సమంత ఎస్ చెబితే నాని, సమంత కలిసి నటించే హ్యాట్రిక్ మూవీ అవుతుందీ చిత్రం.
previous post
next post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!