Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్లో మొదటిసారి ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమె బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అధికారింగా చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా పతాకంపై నిర్మిస్తున్నారు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో దర్శకుడిగా మారి విభిన్న చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్లో పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మహానటి వంటి సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా మేకర్స్ నిర్మిస్తున్న ఈ విభిన్నమైన ప్రేమ కథా చిత్రానికి తాజాగా ‘సీత రామం’ అనే టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
శ్రీరామ నవమి సందర్బంగా సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేశారు. కొత్త సౌండింగ్లో ఆహ్లాదకరంగా అనిపిస్తున్న టైటిల్ లోగీతో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజైంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ముస్లిం యువతిగా నటిస్తుండటం విశేషం. ఆమె కెరీర్లో ఇప్పటి వరకు చేయనటువంటి కొత్త తరహా పాత్ర. ఇప్పటి వరకు చేసినవన్నీ పక్కా కమర్షియల్ అండ్ గ్లామర్ పాత్రలు. కానీ, వీటన్నిటికీ ‘సీత రామం’ చాలా భిన్నమైన చిత్రం..భిన్నమైన పాత్ర. ఇక ఈ సినిమాపై రష్మిక చాలా ఆతృతగా ఉంది.
Rashmika Mandanna: అదే సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.
ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మహానటి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన్నా కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలో తన పాత్ర కథకు ఎంతో కీలకంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఇక ఫస్ట్ గ్లింప్స్ వీడియోను చూస్తే సైనికుడుగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. ఇక తనతో పాటు నటిస్తున్న మృనాల్ రాముడు – సీతగా.. వారిని కలిపే అఫ్రిన్ పాత్రలో రష్మిక కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కథ మొత్తం రష్మిక మందన్నా పాత్ర చుట్టు కథ తిరుగుతుందని సమాచారం. ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టైటిల్‌కు మేకర్స్ యుద్ధంతో రాసిన ప్రేమ కథ అని ట్యాగ్‌లైన్ పెట్టడమే. అదే సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.