Ntr-Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఇందులో హీరోయిన్లుగా నటించారు.
చరిత్రలో ఎన్నడూ కలవని స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు కలిని పేద ప్రజల కోసం బ్రిటీష్ వారిపై ఎలా పోరాటం చేశారు అన్న కల్పిత కథతో ఈ చిత్రం రూపుదిద్దుంది. అనేక వాయిదాల అనంతరం మార్చి 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే మళ్లీ ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. నేడు మహా శివరాత్రి సందర్భంగా `కెమెరా రోలింగ్లో లేనప్పుడు స్క్రోలింగ్` అనే క్యాప్షన్‌తో ఓ అదిరిపోయే పిక్‌ను సోషల్ మీడియా ద్వారా వదిలారు. `నాటు నాటు` సాంగ్ షూటింగ్ బ్రేక్‌లో తీసిన ఫొటో ఇది.
ఇందులో ఎన్టీఆర్, చరణ్‌లు పార్క్‌లోని పచ్చటి గడ్డిపై మ్యాట్లు వేసుకుని పడుకుని ఫోన్లు చూసుకుంటూ ఫుల్‌గా చిల్ అవుతున్నారు. చాలా న్యాచురల్‌గా ఉన్న ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు ఈ పిక్‌ను చూసి తెగ మురిసిపోతున్నారు. మరి దానిపై మీరు ఓ లుక్కేసేయండి.
Scrolling when camera isn’t Rolling 👻 #RRRMovie#MaRRRchIsHere 🔥🌊 pic.twitter.com/Rh9xYKhVGL
— RRR Movie (@RRRMovie) March 1, 2022