Prabhas: ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఎస్ఎస్ రాజమౌళి మరియు ప్రభాస్ అని చెప్పవచ్చు. వీరిద్దరి కలయికలో 2018లో వచ్చిన “బాహుబలి 2” ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ఇండియాలో అన్ని రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. ఈ సినిమా దెబ్బకి బాలీవుడ్ చతికలబడింది. “బాహుబలి 2” తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక సరిహద్దులను జక్కన్న చేరిపేసారు. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే హిందీ సినిమాలు గురించి మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది.
బాహుబలి సెకండ్ పార్ట్ విజయంతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ప్రభాస్…పాన్ ఇండియా సూపర్ స్టార్ అవతారం ఎత్తడం జరిగింది. దీంతో ప్రభాస్ చేస్తున్న సినిమాలకు మినిమం 400 కోట్లు కలెక్షన్స్ వచ్చే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో సాధించని రికార్డ్ తాజాగా ప్రభాస్ సాధించటం జరిగిందంట. విషయంలోకి వెళ్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వసూళ్లలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఆయన కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
దేశంలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్ ప్రభాస్ పేరు 7వ స్థానంలో ఉందని ట్విటర్ ప్రకటించింది. ఈ లిస్ట్ లో ఉన్న ఏకైక హీరోగా ఆయన నిలిచారు. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా భారతీయ చలనచిత్ర రంగంలో ప్రభాస్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే తొమ్మిదవ తారీకు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో పాటు రాజా సాబ్ కూడా చేస్తున్నాడు. ఇక ఏప్రిల్ నెల నుండి “సలార్” సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈ రకంగా వరుస పెట్టే సినిమాలను ప్రభాస్ సెట్స్ మీదకి తీసుకెళ్తున్నాడు. మరోపక్క సోషల్ మీడియాలో తనకు తిరిగి లేదని సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.