అక్కినేని నాగార్జున ఇంటికి తెలంగాణ ప్రభుత్వం పోలీసు భద్రతను కల్పించింది. అందుకు కారణం ఆయన `బిగ్‌బాస్ 3` షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్3 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగ్ ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు తెలియజేశాయి. దీంతో జూబ్లీహిల్స్ రోడ్ నెం.46లోని ఆయన ఇంటికి పోలీసులు భద్రతను పెంచారు. బిగ్‌బాస్‌లో పాల్గొనే సభ్యుల వద్ద బాండ్ పేపర్స్‌పై సంతకాలు తీసుకోవడం.. ఖాళీ పేపర్స్‌పై సంతకాలు తీసుకుని మహిళలను ఇబ్బంది పెట్టే చర్యలు బిగ్‌బాస నిర్వాహకులు చేస్తున్నారని తెలంగాణ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేర వారు బిగ్‌బాస్ షోను నిలిపి వేయాలని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ తెలుగు రియాలిటీ షోపై ఇప్పటి వరకు రానన్ని వివాదాలు, విమర్శలు రావడంతో.. ఈ నెల 21న జరగబోయే ఈ షోను స్టార్ మా యాజమాన్యం నిర్వహిస్తుందా? లేదా? అని తెలియాంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!