Pushpa : గత ఏడాది “అలా వైకుంఠపురంలో” సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బన్నీ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. “నా పేరు సూర్య” లాంటి దారుణమైన డిజాస్టర్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్..ఆ టైంలో అనేక సినిమాలు విని చివరాకరికి త్రివిక్రమ్ స్టొరీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం..గత ఏడాది సంక్రాంతి పండుగకు భారీ బ్లాక్ బస్టర్ కొట్టడం జరిగింది. ఆ తరువాత డైరెక్టర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా అల్లు అర్జున్ చేస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో వీరిద్దరి కలయికలో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. బన్నీ కెరియర్ లో అతని మేక్ఓవర్ ని సరికొత్తగా ఈ రెండు సినిమాలు చూపించడం జరిగాయి. దీంతో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న “పుష్ప” సినిమాపై మెగా అభిమానులకు అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. పైగా ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్ పాత్ర చేస్తూ మరో పక్క లారీ డ్రైవర్ పాత్రలో కూడా సరికొత్త గెటప్ లో గుబురు గడ్డంతో కనిపిస్తున్న నేపథ్యంలో సినిమా స్టోరీ ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి..ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫోటోలు ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో సినిమా యూనిట్ నుండి అందుతున్న కీలక అప్డేట్ ప్రకారం అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8 వ తారీకు. అయితే ఒకరోజు ముందే అనగా ఏప్రిల్ 7వ తారీకు ఈ సినిమాకి సంబంధించి ప్రీ లుడె అఫ్ పుష్ప అనే పేరుతో.. సరిగ్గా సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు.. సినిమా యూనిట్ తాజాగా వెల్లడించింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!