RGV Biopic: ప్రస్తుతం ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఏం నడుస్తుందంటే బయోపిక్ జమానా నడుస్తోందని చెప్పవచ్చు. నటులు, క్రీడాకారులు, సైనికులు, రాజకీయ నాయకులు మొదలైన వారందరి జీవిత కథాంశంతో ఎన్నో బయోపిక్ చిత్రాలు తెరకెక్కాయి. ఈ విధంగా బయోపిక్ సినిమాలు కొన్నిసార్లు బోల్తాకొట్టినప్పటికీ ఈ బయోపిక్ సినిమాలను తెరకెక్కించడానికే ఇండస్ట్రీలో మొగ్గుచూపుతున్నారు. అయితే బయోపిక్ చిత్రాలను తెరకెక్కించడంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎవరు సాటి లేరు అని చెప్పవచ్చు.
తెలుగు ఇండస్ట్రీలో కాంట్రవర్సి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, ఏమి మాట్లాడినా ఒక సెన్సేషన్ అవుతుంది. ఈయన చెప్పే వేదాంతాలు, ఫిలాసఫీలో అభిమానులకు తెగ నచ్చుతాయి. ఈ విధమైనటువంటి క్యారెక్టరైజేషన్ ఉన్న రామ్ గోపాల్ వర్మ జీవిత కథాంశం తెరకెక్కిస్తే ఏ విధంగా ఉంటుందనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతుంటాయి. అయితే నిజానికి రాంగోపాల్ వర్మ బయోపిక్ కి ఎప్పుడు ముహూర్తం పెట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. మరి తాజాగా ఈ సినిమా తెరపైకి వచ్చింది.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బయోపిక్:
రాంగోపాల్ వర్మ బయోపిక్ చిత్రానికి తన అక్క శ్రీమతి విజయ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మొత్తం ఆరు గంటల పాటు ఉన్న ఈ సినిమాని మూడు భాగాలుగా విభజించి విడుదల చేస్తామని అప్పట్లోనే చిత్రబృందం ప్రకటించింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ ఈ సినిమా గురించి ఊసేలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ రామ్ గోపాల్ వర్మను మీ బయోపిక్ తీస్తే ఏ విధంగా ఉంటుంది అని అడగగా.. అందుకు రాంగోపాల్ వర్మ తెరపై నా జీవితం చాలా బోర్ కొడుతుంది. సినిమాకు కావాల్సిన ట్విస్టులు, మలుపులు నా జీవితంలో లేవని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అయితే రామ్ గోపాల్ వర్మ జీవితంలో ఉన్నన్ని ఆశక్తికరమైన ట్విస్టులు, మలుపులు ఎవరి జీవితంలోనూ ఉండవని, రాంగోపాల్ వర్మ బయోపిక్ తీస్తే నిజంగానే సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.అయితే రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల కోరికను తీరుస్తాడా లేదా అన్నది సందేహంగా ఉంది.