ఒక పక్క `డిస్కోరాజా` సెట్స్‌లో ఉండగానే మాస్ మహారాజా రవితేజ తన తదుపరి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తనకు `డాన్‌శీను`, `బలుపు` వంటి సక్సెస్‌లను ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్‌గా సాగిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రవితేజ జోడిగా శృతిహాసన్ జోడిగా నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. మైకేల్‌తో ప్రేమాయణం సాగించి సినిమాలకు దూరమైంది శృతిహాసన్. అయితే ఉన్నట్లుండి మేమిద్దరం విడిపోయామంటూ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. తనకేమీ పట్టనట్లుగా, తెలియదన్నట్లుగా కొన్నిరోజుల పాటు మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్స్తో బిజీగా ఉండిపోయింది శృతిహాసన్. అయితే ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ పెడుతుందట ఈ అమ్మడు. అందులో భాగంగా రవితేజ, గోపీచంద్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందని సమాచారం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!