RRR: దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో “బాహుబలి 2” తర్వాత వచ్చిన “RRR” దేశవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించి సినిమాపై అందరి లుక్ పడేలా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు అన్ని చోట్ల భారీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో సినిమా కి వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్లు రావడం జరిగింది. రాజమౌళి టేకింగ్ దమ్ము ఏంటో మరోసారి “RRR” నిరూపించింది. సామాన్య ప్రేక్షకులు మొదలుకొని సినిమా సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ “RRR” గొప్పతనాన్ని చాటారు. అయితే ఈ సినిమా తాజాగా థియేటర్ నుంచి బయటకు వచ్చాక అమెజాన్ ప్రైమ్ లైన్ లో పాటు Zee 5 లో స్ట్రీమింగ్ కావడం తెలిసిందే. మొదటిలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాగా… మే 20వ తారీకు నుండి జీ5 లో స్ట్రీమింగ్ కావడం జరిగింది.
ఈ క్రమంలో జీ5 లో 1000 మిలియన్ వ్యూస్ పది రోజుల్లో రాబట్టిన తొలి సినిమాగా “RRR” సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. జీ5 ఓటిటి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో… గత పది రోజులకు పైగానే నంబర్ వన్ ట్రెండింగ్ లో “RRR” నిలిచింది. అన్ని భాషల్లో కలిపి ఈ రికార్డు జీ5 లో “RRR” సినిమా క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు డైరెక్టర్ రాజమౌళి అదేవిధంగా హీరోలు చరణ్, తారక్ పడిన కష్టానికి మంచి రిజల్ట్ రావటంతో.. సినిమా యూనిట్ “RRR” సక్సెస్ భారీగా ఎంజాయ్ చేయడం జరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!