NewsOrbit
సినిమా

NTR 30: ఎన్టీఆర్ సినిమాలో సోనాలి బింద్రే.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన న‌టి!

NTR 30: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నాడు. గ‌త ఏడాది స‌మ్మ‌ర్‌లోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. యుశసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ.. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. అలాగే ఇందులో హీరోయిన్ ఎవ‌రు అన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అలియా భ‌ట్, ర‌ష్మిక మంద‌న్నా, పూజా హెగ్డే, దిశా ప‌టానీ, జాన్వీ క‌పూర్ వంటి హీరోయిన్ల‌ పేర్లు వినిపించినా.. ఎవ‌రినీ క‌న్ఫార్మ్ చేయ‌లేదు.

ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజుల నుంచీ ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరోయిన్ సోనాలి బింద్రే కీల‌క పాత్ర‌ను పోషించ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ విష‌యంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సోనాలి బింద్రేకు.. ఎన్టీఆర్ సినిమాపై ప్ర‌శ్న ఎదురైంది.

అందుకు ఆమె త‌న‌ను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని, నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారం ఫేక్ అంటూ తేల్చేసింది. ఏంటి ? నేనా ? ఎన్టీఆర్ సినిమాలోనూ..? అంటూ ఆమె ఆశ్చ‌ర్యాన్ని కూడా వ్య‌క్తం చేసింది. కాగా, సోనాలి బింద్రే గ‌త కొంత కాలం నుంచి వెండితెర‌కు దూరంగా ఉంటోంది. 2018లో కాన్స‌ర్ బారిన ప‌డిన సోనాలి బింద్రే.. అమెరికాలో చికిత్స తీసుకుని ఆ వ్యాధి బారి నుంచి బ‌య‌ట‌ప‌డింది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri