NewsOrbit
సినిమా

‘రాజమౌళితో విసిగిపోతున్నాం..’ ఆర్ఆర్ఆర్ టీమ్ ఆవేదన..!

rrr team complaining on rajamouli

దర్శకధీరుడు రాజమౌళి సినిమా సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటాడన్న సంగతి తెలిసిందే. ఏళ్లపాటు షూటింగ్ చేస్తారు. తీసే సన్నివేశం, సినిమా ఔట్ పుట్ లో పర్ఫెక్షన్ కోసమే అంత సమయం తీసుకుంటారు. అందుకే ఇండస్ట్రీలో రాజమౌళికి జక్కన్న అనే పేరు స్థిరపడిపోయింది. ఈరోజు రాజమౌళి పుట్టినరోజు. ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా సరదాగా ఓ చిన్న వీడియో చేశారు. అందులో రాజమౌళి పనితీరుతో తామెంత విసిగిపోతున్నామో తమషాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

rrr team complaining on rajamouli
rrr team complaining on rajamouli

‘షూటింగ్ కు వెళ్లగానే 40 అడుగుల ఎత్తు నుంచి దూకే షాట్ చెప్తారు. బాగుంది. ఏలా చేస్తారు అని అడగ్గానే ‘నువ్వే చేస్తున్నావ్’ అంటారు సింపుల్ గా. ల్యాప్ టాప్ తెప్పించి అప్పటికే డిజైన్ చేసిన సన్నివేశాలు చూపిస్తారు. ఇంకేం చేస్తాం.. చేయకుండా..!’ అని రామ్ చరణ్ అన్నారు.

‘కష్టమైన షాట్స్ అన్నీ రిలాక్స్ మూడ్ లోకి వెళ్తున్నామనగా 12కి చెప్తాడాయన. 4 అయిపోతుంది. ఆకలి దంచేస్తున్నా పట్టించుకోడు. ఒక్క షాట్ 4 గంటలు తీస్తాడు. ఈయన పర్ఫెక్షన్ కోసం మమ్మల్ని చంపేస్తూంటాడు. అందుకే జక్కన్న అనేది’ అని ఎన్టీఆర్ అన్నారు.

‘షూటింగ్ ఎప్పుడు ప్యాక్ అప్ చెప్తారో తెలీదు. హమ్మయ్య.. షూటింగ్ అయిపోయింది.. ఇంటికెళ్దాం అనుకునేలోపు మీటింగ్ పెడతారు. రేపటి సన్నివేశాల గురించి వివరిస్తూ సాగిదీస్తూ ఉంటారు. నేనేమో టైమ్ చూసుకుంటూ ఉంటాను’ అని సెంధిల్ కుమార్ అన్నారు.

‘రాజమౌళి ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఉదయం పూట మరీను. గుడ్ మార్నింగ్ చెప్పాలంటే కూడా ఆలోచిస్తాను. ఆయన్ను డిస్టర్బ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓసారి ఇలానే చెప్తే హా.. చెప్పండి అంటూ కంగారు పడతారు. అందుకే ఆయన్ను డిస్టర్బ్ చేయాలంటే భయం’ అని సాబూ సిరిల్ అన్నారు.

‘పల్లవి జనవరిలో రాస్తే జూన్, జూలైల్లో చరణం అంటాడు. డిసెంబర్ లో లిరిక్స్ రాస్తే తర్వాత ఏడాది మార్చిలో రికార్డింగ్ అంటాడు. మళ్లీ నవంబర్ లో వాయిస్ మిక్సింగ్ అంటాడు. అసలు మనం ఏం అనుకున్నామో.. ఏం చేస్తున్నామో అంటూ ఇంట్రెస్ట్ పోతుంది’ అని కీరవాణి అన్నారు.

వీరితోపాటు నిర్మాత దానయ్య, పలువురు కో-డైరెక్టర్లు కూడా రాజమౌళితో ఎంత విసిగిపోతున్నామో నటిస్తూ సరదాగా చూపించారు. మొత్తానికి రాజమౌళికి మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు.

 

 

 

Related posts

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri