Ravi Teja: తెలుగు చలనచిత్ర రంగంలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వటంలో రవితేజ ఎప్పుడు ముందుంటారు. ఈ రకంగానే చాలామంది దర్శకులను హీరోయిన్లను మాస్ మహారాజ ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. ఎక్కువగా తన సినిమాలలో కొత్త అమ్మాయిని పరిచయం చేయాలని అనుకుంటాడు. ఈ రకంగానే గతంలో ఖిలాడీ, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలతో కొత్త అమ్మాయిలను రవితేజ పరిచయం చేయడం జరిగింది. కాగా ఇప్పుడు మరో కొత్త ముద్దుగుమ్మకు అవకాశం ఇవ్వడానికి రెడీ కావడం జరిగిందట. విషయంలోకి వెళ్తే “జాతి రత్నాలు” ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రుక్మిణి వసంత్ నీ హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడలో బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రుక్మిణి వసంత్ తర్వాత “సప్త సాగరాలు దాటి” సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్యతరగతి చెందిన అమ్మాయిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త జైలుకు వెళ్తే బాధపడే భార్యల ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. తెలుగులో కూడా ఈ సినిమా విడుదలయ్యి విజయం సాధించింది. ఆ తర్వాత “సప్తసాగరాలు దాటి” సెకండ్ పార్ట్ తో కూడా అనిపించింది.
అయితే ఇప్పుడు “జాతి రత్నాలు” దర్శకుడు కెవి అనుదీప్ రవితేజతో చేస్తున్న సినిమాలో రుక్మిణి వసంత్ నీ హీరోయిన్ గా తీసుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నారు. జాతి రత్నాలు విజయం సాధించిన తర్వాత అనుదీప్ చాలా స్లోగా సినిమాలు చేస్తూ ఉన్నారు. రవితేజతో చేయబోయేది అనుదీప్ కెరియర్ లో మూడో సినిమా. ఈ సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేసే విధంగా డైరెక్టర్ మరియు హీరో డిసైడ్ అయినట్లు దసరాకి ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.