Salman Khan : సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వరస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ పోకిరి సినిమాను హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేసి అప్పటినుండి వరుసపెట్టి విజయాలు సాధిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే సల్మాన్ ఫెయిల్యూర్ లో ఉన్న సమయంలో షారుక్ ఖాన్ మంచి రైజింగ్ లో అప్పట్లో ఉండటం జరిగింది.
అంతేకాకుండా అప్పట్లో ఇద్దరి మధ్య విభేదాలు ఉండేవి. మొదటి స్నేహితుల తర్వాత విభేదాలు రాగా ఇటీవల ఇద్దరూ కలిసి పోవటంతో ఇప్పుడు స్నేహితుడు షారుక్ కోసం హుటాహుటిన దుబాయ్ కి వెళ్లడానికి సల్మాన్ ఖాన్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే షారుక్ ఖాన్ ప్రస్తుతం పటాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నారు అట. అయితే సినిమాకి సంబంధించి షూటింగ్ చివరి దశలో ఉండటంతో..
పడుకోకుండా ముందుగానే సల్మాన్ సన్నివేశాలను చిత్రీకరించాలని డైరెక్టర్ పట్టుబట్టడంతో.. సల్లూభాయ్ వెంటనే ఏమి ఆలోచించకుండా పోటాపోటీగా దుబాయ్ కి వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఈ క్రమంలో తన సినిమా షూటింగ్ అని కూడా తన ఫ్రెండ్ షారుక్ కోసం సల్మాన్ పక్కన పెట్టడం బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలకి ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.