సల్మాన్ ఖాన్ తాజా సినిమా ‘భారత్’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని సల్మాన్ ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. వృద్ధుడిగా డిఫరెంట్ లుక్‌లో సల్మాన్‌ఖాన్‌ను చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఒక జర్నీగా నడిచే ఈ కథలో సల్మాన్ యువకుడి నుంచి వృద్ధుడి వరకు రకరకాల లుక్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అలాంటి లుక్‌ను విడుదల చేస్తారని ఎవరూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదని సోషల్ మీడియాలో అతని అభిమానులు రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను ఈనెల 24న విడుదల చేయుబోతున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌కి జోడీగా కత్రినా కైఫ్ నటిస్తున్నారు. అలాగే సోదరిగా దిశా పటాని నటిస్తోంది. ఈ సినిమాను హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. జూన్ 5న రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!