చిత్ర పరిశ్రమలో ఎప్పుడు లేని విధంగా 2020లో గడ్డు పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో షూటింగ్ లు, థియేటర్లు మూత పడ్డాయి. దాదాపు 9 నెలల పాటు సినీ పరిశ్రమ మూగబోయింది. ఇది ఇలా ఉంటే సినీ నిర్మాతలు ఓటీటీల ద్వారా తమ చిత్రాలను విడుదల చేశారు. గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన చిత్రాల్లో కూడా ఓటీటీలలో విడుదలైన చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి.
థియేటర్లు మూసి వేసి ఉండటంతో ఓవర్ ది టాప్(ఓటీటీ) ప్లాట్ ఫామ్ లకు ప్రేక్షకదారణ పెరిగింది. బాలీవుడ్ ఇంకా ప్రాంతీయ సినీ పరిశ్రమలు ఓటీటీలలో సినిమాలను విడుదల చేశారు. వాటిలో దిల్ బేచారా, శకుంతలాదేవి, తానాజీ, గుంజన్ సక్సేనా, లక్ష్మి, సూరారై పొట్రూ, సడక్ 2 ఇంకా మరికొన్ని ఉన్నాయి.
గూగుల్ లో 2020 సంవత్సరంకి గాను గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన చిత్రాల్లో ఓటీటీల ద్వారా రిలీజ్ అయిన సినిమాలే ఉన్నాయి. లాక్ డౌన్ కి ముందు రిలీజ్ అయిన భాగీ 3, ఎట్రాక్షన్ సినిమాలతో పాటు లాక్ డౌన్ లో రిలీజ్ అయిన దిల్ బేచారా, శకుంతలాదేవి, లక్ష్మీ, సడక్ 2, గులాబో సితాబో, గుంజన్ సక్సేనా చిత్రాలు ప్రేక్షకులు ఎక్కువగా శోదించినట్లు గూగుల్ తమ గణాంకాలను వెల్లడించింది.
శకుంతలాదేవి, లక్ష్మీ, సడక్ 2, గులాబో సితాబో తో మరికొన్ని చిత్రాలు దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు. దిల్ బేచారా, సురారై చిత్రాలు ప్రేక్షకుల ఆధరణ పొందాయి. లాక్ డౌన్ తీసేయటంతో ఇప్పుడిపుడే సినిమా షూటింగ్ లతో సినీ పరిశ్రమ కళకళలాడుతోంది. డిసెంబర్ 4న థియేటర్ లు కూడా తెరుచుకున్నాయి. లాక్ డౌన్ లో ఓటీటీలకు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ఉంటుందో ఉండదో చూడాలి.