తెలుగు సినిమా రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పేర్లలో ఎక్కువగా వినబడే ఒక పేరు దగ్గుబాటి రానా. కానీ కరోనా వైరస్ వచ్చిన టైం లో షూటింగ్స్ అని ఆగిపోయాక ఎవరూ ఊహించని రీతిలో రానా తాను పెళ్లి చేసుకోబోయే ఈమె అంటూ ఓ అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే బంటీ సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె అయిన మిహీకా బజాజ్ ను లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అదే రీతిలో లాక్డౌన్ టైం లోనే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఇదిలా ఉండగా ఆగస్టు 8వ తారీఖున బ్రహ్మాండమైన ముహూర్తనా వివాహం వైభవంగా చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో రానా తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు. తాను పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం ఇదే అని నేను అనుకుంటున్నాను అని పేర్కొన్నాడు. అంతేకాకుండా తనకి కాబోయే భార్య ఇంటికి తన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరం అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆమె తనకి కరెక్ట్ జోడి అంటూ చెప్పుకొచ్చాడు. జీవితంలో అని వాటంతటవే సజావుగా సాగిపోతూ ఉంటాయి. నా జీవితంలో కూడా పెళ్లి అదే రీతిలో సాగుతుందని నేను అనుకుంటున్నాను. నాకూ కోబోయే జీవిత భాగస్వామికి మంచి మనసున్న అమ్మాయి, మా జంట ఇతరులకు ఆదర్శంగా గొప్ప జంటగా నిలుస్తుందన్న నమ్మకం ఉన్నట్లు రానా చెప్పుకొచ్చాడు.