NewsOrbit
Featured బిగ్ స్టోరీ సినిమా

Vijay Sethupathi : థియేటర్లో లెక్కలు రాసుకుంటూ – ఉత్తమ నటుడిగా..! సింగిల్ టేక్, సింగిల్ షాట్..!!

Vijay Sethupathi : Life Story backgroud

Vijay Sethupathi : అది ఓ తెలుగు సినిమా షూటింగ్ మొదటి రోజు … ఆ సినిమాకు నెగిటివ్ పాత్రలో ఓ నటుడ్ని తీసుకున్నారు. అతనితో కలిసి పని చేయడం ఆ దర్శకుడికి, నిర్మాతలకు, సహా నటులకు అదే మొదటిసారి..!
సీన్ : సముద్రం ఒడ్డున టీ తాగుతూ.., టీ లో తీయదనం ఎక్కువైనా దాన్ని మేనేజ్ చేసేలా పంచదార నోట్లో వేసుకునే ఓ ప్రత్యేకమైన సీన్ అది. ఓ రకమైన హావభావాలు పలికించాలి. షూటింగ్ మొదటి రోజు. నటులు కొత్త. దర్శకుడు కొత్త. సీన్ బాగా వస్తేనే అందరిలో సానుకూలత నాటుకుంటుంది. ఆ నటుడు పరభాషీ. తెలుగు రాదు. అతనికి సీన్ చెప్పారు. అతను ఒకే. వెంటనే చేసేస్తా అన్నారు. అందరూ లైట్ తీసుకున్నారు. నటుడు సీన్ లోకి వచ్చారు. కెమెరా ఆన్ అయింది. ఎస్… ఎవరూ ఊహించనిదే.., ఆ నటుడు సింగిల్ టేక్ లో.., సింగిల్ షాట్ లో ఒకే మాటతో.. దర్శకుడు అనుకున్న కంటే బాగా హావభావాలు పలికించి సీన్ పండించారు. ఆ నటుడే విజయ్ సేతుపతి.. ఆ సినిమా ఉప్పెన..!!

Vijay Sethupathi : Life Story backgroud
Vijay Sethupathi : Life Story backgroud

బిల్డప్ ఉండదు. భారీ డైలాగు ఉండదు. వెనుక మ్యూజిక్ పెద్దగా ఉండదు. హడావిడి ఏమి ఉండదు. అంతా సింపుల్ గా సైలెంట్ గా… కేవలం ముఖంలో హావభావాలతోనే సీన్ ని ప్రేక్షకులకు చూపించే అతి కొద్దిమంది నటుల్లో ఈయన ఒకరు..! విజయ్ సేతుపతి గురించి చెప్పుకోవాలంటే పైన ఒక ఉదాహరణ మాత్రమే. ఎక్కడైనా.., ఎప్పుడైనా, ఎంత కఠినమైన సీన్ అయినా… సులువుగా, సింగిల్ టేక్ లో చేసెయ్యడమే అతని ప్రత్యేకత. ఉప్పెన షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు విజయ్ సేతుపతి నటన చూసి డైరెక్టర్, నిర్మాతలు కూడా ముగ్ధులయ్యారంటే.. అతని గురించి చెప్పుకోవచ్చు..!! తొమ్మిదేళ్ల కిందట పిజ్జా సినిమాలో లేత కుర్ర హీరో.., మూడేళ్ళ కిందట 1996 అనే చిత్రంలో ప్రేమ విఫలైన హీరో.., ఏ ఏడాది సంక్రాంతికి వచ్చిన మాస్టర్ చిత్రంలో విలన్. ఉప్పెనలో పరువు కోసం, కులం కోసం తాపత్రయపడే తండ్రి. పాత్ర ఏదైనా.. సులువుగా చేసుకుంటూ తన నట జీవితంలో అనేక మలుపులు చూపిస్తున్న విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇదీ చదవండి : మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యే”కథ”లు తెలుసా..!?

Vijay Sethupathi : Life Story backgroud
Vijay Sethupathi : Life Story backgroud

Vijay Sethupathi : ఖాతా పుస్తకాలు రాసుకుంటూ… నటుడిగా..!!

నిజానికి విజయ్ సేతుపతికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేదు. ఆయన వారసత్వ నటుడు కాదు. బీకామ్ వరకు చదివారు. ఇరవై ఏళ్ళ కిందట చెన్నైలోని ఓ సినిమా థియేటర్లో అకౌంటెంట్ గా చేరారు. మూడేళ్లు అలా పని చేస్తూనే.. ఆ థియేటర్లోనే ప్రతీ సినిమాని చూస్తూ.. నటనపై ఆసక్తి పెంచుకున్నారు. తనలోని ప్రతిభని సానపెట్టారు. ఈ క్రమంలోనే థియేటర్ యజమాని ద్వారా డిస్ట్రిబ్యూటర్ తద్వారా ఓ చిన్న నిర్మాత వద్దకు వెళ్లి షార్ట్ ఫిలిమ్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. 2006 నుండి సినిమాల్లో మొదలు పెట్టారు. 2010 లో వచ్చిన సుందర పాండియన్.. ఆ తర్వాత వచ్చిన పిజ్జా సినిమాలు విజయ్ కెరీర్ ని మలుపు తిప్పాయి. అతనిలో పరిపూర్ణ నటుడిని బయటకు తెచ్చాయి. ఆ తర్వాతమూడేళ్ళ కిందట సూపర్ డీలక్స్ సినిమాలో ఆయన చేసిన ట్రాన్సజెండర్ పాత్రతో దేశం మొత్తం విజయ్ సేతుపతి గురించి తెలుసుకుంది. ఆయన నట శిఖర ఎత్తు తెలుసుకుంది. ఆ ఏడాదిలోనే 96 చిత్రం ద్వారా మరోసారి ఆయన దేశం మొత్తం తెలిసారు. ఇక ఆయన కెరీర్ కి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు ఆయన కాల్ షీట్లు కోసం టాలీవుడ్, కాలీవుడ్ సహా బాలీవుడ్ కూడా వేచి చూస్తుంది.

Vijay Sethupathi : Life Story backgroud
Vijay Sethupathi : Life Story backgroud

అవార్డుల పంట మామూలుగా లేదు..!!

నటుడికి అవార్డులు కొంత సంతృప్తిని ఇస్తాయి. కానీ విజయ్ సేతుపతికి వరిస్తే ఆ అవార్డుకే విలువ వచ్చినట్టు భావిస్తాయేమో… ఆయనకు ఈ పుష్కర కాలం కెరీర్ లోనే 14 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. మరో 21 అవార్డులకు ఆయన నామినేట్ అయ్యారు. అన్నిటి కంటే ప్రత్యేక విషయం ఏమిటంటే… ఉత్తమ హీరో, ఉత్తమ విలన్, ఉత్తమ నటుడు… ఇలా భిన్నమైన పాత్రల్లో ఒదిగిపోతుండడం.., ఏ పాత్ర అయినా ఈజీగా చేస్తుండడం ఆయనకు తప్ప మరొకరికి సాధ్యం కాదేమో..! మరో రెండు దశాబ్దాల పాటూ ఇండియన్ సినిమా విజయ్ సేతుపతి నామస్మరణతో ఉంటుంది అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు..!!

Related posts

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu