Merry Christmas OTT: OTT ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా సంక్షోభం నుండి, OTT ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమాలు నుండి వెబ్ సిరిస్ వరకు అనీ రకాల కంటెంట్ లు కలిగిన ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండనుంది. కాబట్టి వీక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూడవచ్చు. దీంతో ఎంటర్టైన్మెంట్ లవర్స్ OTTకి ఎంతగానో అలవాటు పడ్డారు, కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడల్లా థియేటర్లలో చూడవలసి ఉంటుంది. మరి ఇప్పుడు… నెలకోసారి ఖర్చు లేకుండా లేకుండా ఇంట్లోనే చూడొచ్చు. దీని దృష్టిలో పెట్టుకుని చాలామంది నిర్మాతలు ఓటిటిలో కొత్త సినిమాలు కూడా విడుదల చేస్తున్నారు. థియేటర్లలో విడుదలైన కానీ నెలరోజులు కాకముందే ఓటిటిలో సినిమాలు వచ్చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ దర్శకుడు అయిన ఓటిటిలో నెల రెండు నెలల లోపే సినిమాలు వచ్చేస్తున్నాయి. దీంతో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండానే ఓటిటిలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రకంగానే తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో సినిమా థియేటర్ లో విడుదలై బోల్తా పడి నెల రోజులు గడవకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. విషయంలోకి వెళ్తే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మిస్టర్ త్రిల్లర్ సినిమా “మేరీ క్రిస్మస్” చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదల అయింది. శ్రీరాహ్ రాఘవన్ డైరెక్షన్లో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా “మేరీ క్రిస్మస్” తెరకెక్కింది. మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. తమిళ వెర్షన్లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమా విడుదలై 30 రోజుల్లోనే అనగా ఫిబ్రవరి 9వ తారీకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఒకవేళ ఫిబ్రవరి 9 కాకపోతే 16వ తారీకు లోపు ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అని వార్తలు వస్తున్నాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!