హీరో విశాల్, అనీశా రెడ్డిల పెళ్లికి డేట్ ఫిక్సయ్యింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరికి అక్టోబర్ 9న పెళ్లి చేయాలనుకుంటున్నారు. అయితే పెళ్లి చెన్నైలోని నడిగర్ సంఘం భవనంలోనా? మరెక్కడైనానా? అని తెలియాల్సి ఉంది. విశాల్, అనీశా ప్రేమను ఇరు కుటుంబాల వారు ఆమోదించి ఇటీవల నిశ్చితార్థం కూడా చేసిన సంగతి తెలిసిందే. నడిగర్ సంఘం పూర్తయితే అక్కడే తన పెళ్లి అని ఇది వరకు విశాల్ ప్రకటించారు. మరో నాలుగైదు నెలల్లో నడిగర్ సంఘం బిల్డింగ్ పనులు పూర్తవుతాయి. కాబట్టి విశాల్ పెళ్లి కూడా అక్కడే జరుగుతుందని అనుకుంటున్నారు.
previous post