RRR: ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ లేటెస్ట్ భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచిన సంగతి తెలిసిందే. ఉన్న ఈ కొద్ది సమయాన్ని పక్కాగా ఉయోగించుకుని ఆర్ఆర్ఆర్ సినిమాకి వీలైనంతవరకు బజ్ తీసుకురావాలని తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘ఎత్తర జెండా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను వదిలారు.
ఈ పాటలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అలియాభట్ ఆడిపాడారు. ప్రస్తుతం ఈ పాట అందరినీ బాగా ఆకట్టుకుంటూ నెట్టింట దూసుకుపోతూ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయానికి ముందు ఇలా ఏకంగా వీడియోసాంగ్ రిలీజ్ చేయడంతో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. ఈ పాట సినిమాలో ఉండదని..జస్ట్ ప్రమోషనల్ సాంగ్ అని చెప్పుకుంటున్నారు. ఇంతక ముందు వదిలిన దోస్తీ అనే పాటను కూడా ప్రమోషనల్ పాటగానే వదిలారు.
RRR: అందుకే, ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడుతుందేమో..?
అయితే, సినిమా కోసం రెండు ప్రమోషనల్ సాంగ్స్ ఎందుకు వదిలినట్టు అని పలు సందేహాలు మొదలయ్యాయి. మళ్ళీ చైనాలో కరోనా కొత్త వేరియంట్ మొదలై విజృభిస్తోంది. ఇప్పటికే, అక్కడ లాక్డౌన్ కూడా విధించారు. ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్స్ కంటే ఇది చాలా డేంజర్ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఎలా ఉందంటే..రెండు రోజులకోసారి ఇంటి నుంచి కేవలం ఒక్కరు మాత్రమే వచ్చి కావాల్సినవి కొనుక్కొని వెళ్ళాలి. అంతకు మించి ఏ అనుమతులు లేవు. ఈ నేపథ్యంలో మరోసారి అంతటా లాక్ డౌన్ విధించే అవకాశాలున్నట్టు సమాచారాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించకపోతే అన్నికంటే ముందు మూతపడేది థియేటర్సే. అందుకే, ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడుతుందేమో అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!