NewsOrbit
న్యూస్

అంతుచిక్కని మిస్టరీ : తరలిపోతున్న ఏలూరు వాసులు

 

ఏలూరు అంతు చిక్కని వ్యాధి తీవ్రత అంతకంతకు పెరగటంతో ప్రజల్లో భయం నెలకొంది. కుటుంబాలకు కుటుంబాలు ఏలూరు వీడి వెళ్తున్నాయి. తమ బంధువులు ఇళ్లకు పిల్లలను తీసుకుని మరి తరలిపోతున్నారు. వ్యాధికి కారణాలు తెలకపోవడం ఆందోళన కలిగిస్తుంది.. మరో పక్క ప్రభుత్వం సైతం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. 65 వార్డ్ సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాలను హాస్పిటల్స్ గా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఏలూరులో అందుచిక్కని అస్వస్థతకు గురైన అంశానికి సంబంధించిన ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్‌ నివేదిక

మొత్తం అస్వస్థకు గురైనవారు- 340.
మరణించిన వారు – 1
*మెరుగైన చికిత్సకోసం తరలించిన వారు – 14
*డిశ్చార్జి అయిన వారు – 168.
*ఏలూరు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 5 గురికి చికిత్స, డిశ్చార్జి.
*అస్వస్థతకు గురైన వారిలో పురుషులు 180, మహిళలు 160.
*అస్వస్థతకు గురైనవారిలో ఏలూరు అర్బన్‌కు చెందినవారు – 307.
*ఏలూరు రూరల్‌కు చెందిన వారు – 30
దెందులూరు – 3

*లక్షణాలు*

3 – 5 నిమిషాలపాటు మూర్ఛ
ఒక్కసారి మాత్రమే.
రిపీట్‌కాలేదు
మతిమరుపు
ఆందోళన
వాంతులు
తలనొప్పి
వెన్నునొప్పి
నీరసం.
*ఇప్పటివరకూ.. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదు.
తీవ్రత తక్కువగా ఉంది.
మూర్ఛఅనేది ఒకేసారి వస్తుంది.. మళ్లీ రిపీట్‌ కాలేదు.

అన్ని రకాల పరీక్షలు

ఏలూరులో మున్సిపల్‌ వాటర్‌ పంపిణీ లేని ప్రాంతాల్లోకూడా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు.
*ఒక ఇంటిలో ఒకరు లేదా ఇద్దకు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేకించి పలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది మాత్రం లేదు..వయసుతో తేడాలేకుడండా వస్తుంది..రోజూ మినరల్‌వాటర్‌ తాగే వాళ్లుకూడా అస్వస్థతకు గురయ్యారు.
*22 తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా రిపోర్టులు సాధారణస్థితినే సూచించాయి.
*52 రక్త నమూనాలను పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి. 35 సెరిబ్రల్‌ స్పైనల్‌ ఫ్లూయిడ్‌ శాంపిళ్లను పరీక్షంగా సెల్‌ కౌంట్‌ నార్మల్‌ వచ్చింది. కల్చర్‌ రిపోర్టు రావాల్సి ఉంది. 45 మంది సీటీ స్కాన్‌ చేశారు. నార్మల్‌గానే ఉంది.
*9 పాల నమూనాలను స్వీకరించారు. అవికూడా ఫలితాలు సాధారణంగానే ఉన్నాయి.
*సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ విశ్లేషణకోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి 10 నమూనాలను పంపించారు. ఫలితం రావాల్సి ఉంది.

*ఇంటింటి సర్వే*

*62 గ్రామ, వార్డు సచివాలయాలు సర్వే లో పాల్గొన్నాయి.
*57,863 కుటుంబాల్లో ఉన్నవారిపై ఆరోగ్య సర్వే చేశారు.
*కుటుంబ సర్వే ద్వారా 191 మంది అస్వస్థులను గుర్తించారు.
*వీరందరినీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
*బాధితులకు చికిత్స అందిస్తున్న స్పెషలిస్టులతో సహా 56 మంది డాక్టర్లు
మైక్రో బయాలజిస్ట్‌లు 3
నర్సులు 136 మంది, ఎఫ్‌ఎన్‌ఓలు 117, ఎంఎన్‌ఓలు 99
*సేవలందిస్తున్న అంబులెన్స్‌లు 20
*62 మెడికల్‌ క్యాంపుల నిర్వహణ
*24 గంటలు మెడికల్‌క్యాంపులు నడిచాయి.
*ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రి సహా నాలుగు ఆస్పత్రుల్లో 445 బెడ్లు అందుబాటులో.
రోగులకు మంచి పౌష్టికాహారం
*విజయవాడ జీజీహెచ్‌లో 50 బెడ్లు కేటాయింపు.
*12 మంది డాక్టర్లు, 4 అంబులెన్స్‌లు, 36 మంది నర్సింగ్‌ సిబ్బంది ద్వారా సేవలు.
*విజయవాడకు ఇప్పటివరకూ 7గురు తరలింపు. అందరి పరిస్థితి స్థిరంగా ఉంది.

author avatar
Special Bureau

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju