నాగచైతన్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్ గా ఉండదు. అందరిలాగా ఎప్పటికప్పుడు అప్డేట్ లు [పోస్ట్ చెయ్యడం, లేదా ఫోటోలు పోస్ట్ చెయ్యడం లాంటివి అస్సలు చెయ్యదు. చాలా ముఖ్యమైన కొన్ని సందర్బాల లో మాత్రమే ట్వీట్ కాని పోస్ట్ కాని షేర్ చేస్తూ ఉంటాడు.
సరిగ్గా గమనిస్తే నాగచైతన్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చాలా తక్కువ ఉంటాయి. అందులో కూడా ఎక్కువ శాతం వరకు సమంత ఉన్నవి మాత్రమే ఉంటాయి. కానీ వాటిల్లో ఏవి రొమాంటిక్ గా అనిపించవు. అయితే, తాజాగా మొదటి సారి నాగ చైతన్య సమంతకు ముద్దు పెడుతున్న ఫొటో ఒకటి షేర్ చేశాడు. సమంతతో తీసుకున్న ఈ రొమాంటిక్ ఫొటోను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేందుకు చైతూ షేర్ చెయ్యగా అది ఇప్పుడు వైరల్ గా మారింది.
తన భార్య సమంత అక్కినేని రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. కాని చైతూ మాత్రం చాలా అరుదుగా షేర్ చేస్తుంటాడు. అందులో రొమాంటిక్ ఫోటోల గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. కనుక చైతూ షేర్ చేసిన ఈ రొమాంటిక్ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన ఫొటోగా అక్కినేని అభిమానులు అంటున్నారు.
ఇలాంటి రొమాంటిక్ ఫొటోలను నాగచైతన్య షేర్ చేయడం ఆనందంగా ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇతర హీరోల లాగా మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నాం అంటున్నారు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం విదితమే. చైతు వచ్చే ఏడాది ‘లవ్ స్టోరీ’ మరియు ‘థ్యాంక్యూ’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు.